కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్), కోల్‌కతా నైడ్ రైడర్స్(కేకేఆర్) జట్ల మధ్య ఐపీఎల్ 201మ్యాచ్ జరిగింది. అయితే, టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 142 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్‌పై విజయం సాధించింది.
విశ్వాసమే గెలిపించింది: కార్తీక్
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరిచిందని కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తిక్ చెప్పారు. 'బట్లర్, త్రిపాఠి రాజస్థాన్‌పై అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మేము ఏ క్షణంలోనూ విశ్వాసాన్ని కోల్పోలేదు. కీలక సమయంలో కుల్దీప్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ప్లే ఆఫ్‌కు మేము అర్హులం అనుకుంటున్నాం' అని తెలిపాడు. అటు ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఐపీఎల్-11 పాయింట్ల పట్టిక
- సన్‌రైజర్స్ హైదరాబాద్-12మ్యాచులు-9విజయాలు -18 పాయింట్లు
- చెన్నై సూపర్ కింగ్స్- 12మ్యాచులు -8విజయాలు -16పాయింట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్- 13మ్యాచులు -7విజయాలు-14పాయింట్లు
- రాజస్థాన్ రాయల్స్-13మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్- 12మ్యాచులు -6విజయాలు-12పాయింట్లు
- ముంబై ఇండియన్స్- 12మ్యాచులు-5విజయాలు-10పాయింట్లు
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 12మ్యాచులు -5విజయాలు-10పాయింట్లు
- ఢిల్లీ డేర్‌డెవిల్స్- 12మ్యాచులు-3విజయాలు-6పాయింట్లు