Arjun Tendulkar Maiden IPL Wicket: ఆడింది రెండు మ్యాచ్‌లే.. సచిన్‌ను అధిగమించిన అర్జున్‌ టెండూల్కర్!

Arjun Tendulkar breaks Sachin Tendulkar Bowling Record in IPL. 2009వ సీజన్‌లో సచిన్‌ 6 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 2023లో నాలుగు ఓవర్లు వేసిన అర్జున్.. వికెట్ తీశాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 19, 2023, 05:00 PM IST
Arjun Tendulkar Maiden IPL Wicket: ఆడింది రెండు మ్యాచ్‌లే.. సచిన్‌ను అధిగమించిన అర్జున్‌ టెండూల్కర్!

Arjun Tendulkar Breaks Sachin Tendulkar Bowling Record in IPL: క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ల గాయాల కారణంగా అర్జున్‌ తుది జట్టులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై మొదటి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేసి వికెట్ తీశాడు. అర్జున్‌ వికెట్‌ తీయగానే ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌లో సచిన్‌ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అర్జున్‌ టెండూల్కర్ తీసిన తొలి వికెట్‌ (Arjun Tendulkar Maiden IPL Wicket) అతడికి ప్రత్యేకమైందిగా నిలిచింది. అంతేకాదు రెండు మ్యాచ్‌లతోనే తండ్రి సచిన్‌ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్‌ ఐపీఎల్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 2009వ సీజన్‌లో సచిన్‌ 6 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 2023లో నాలుగు ఓవర్లు వేసిన అర్జున్.. వికెట్ తీశాడు. ఈ విషయంలో సచిన్‌ను అతడి తనయుడు అధిగమించడం విశేషం. చివరి ఓవర్లో బౌలింగ్‌ చేసిన అర్జున్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను అవుట్‌ చేయడం ద్వారా కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించాడు.

2009లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ తరఫున తొలిసారిగా బౌలింగ్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్ మొదటి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చాడు. 2023లో అదే కోల్‌కతాపై అరంగేట్రం చేసిన అర్జున్‌ టెండూల్కర్.. తొలి ఓవర్‌లో ఐదు పరుగులే ఇవ్వడం విశేషం. మ్యాచ్ అనంతరం అర్జున్ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో తొలి వికెట్‌ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. బౌలింగ్‌ వేయడాన్ని నేను ఎంతో ఆస్వాదిస్తా. కెప్టెన్‌ ఏ సమయంలో బౌలింగ్‌ చేయమన్నా సిద్ధంగా ఉంటా. జట్టు ప్రణాళికలకు కట్టబడి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పాడు. 

'నేను, నాన్న క్రికెట్‌ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఆటకు ముందు వ్యూహాల గురించి ఎక్కువగా చర్చించుకుంటాం. ప్రాక్టీస్‌లో ఏదైతే చేస్తావో మ్యాచ్‌లో అదే ఆటను కొనసాగించాలని నాన్న సూచించారు. బంతి రిలీజ్‌ పైనే నేను దృష్టి పెడతాను. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తాను' అని అర్జున్‌ టెండూల్కర్ తెలిపాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 178 పరుగులకే పరిమితం అయింది. 

Also Read: Mohammed Siraj IPL Betting: తెలుగోడి నుంచి కాల్.. బెట్టింగ్ ట్రాప్‌లో మొహ్మద్ సిరాజ్! బీసీసీఐ విచారణ

Also Read: IPL 2023 Points Table: ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్.. టాప్‌లో రాజస్థాన్ రాయల్స్! సన్‌రైజర్స్‌ స్థానం ఎంతో తెలుసా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News