NZ vs AFG: అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ ఘన విజయం- భారత్​ సెమీస్​ అవకాశాలకు గండి

T20 World cup 2021: టీ20 వరల్డ్ కప్​లో భారత్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో అఫ్గాన్​ ఓటమితో టీమ్​ ఇండియాకు సెమీస్ తలుపులు మూసుకుపోయాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2021, 07:30 PM IST
  • టీ20 వరల్డ్​కప్: అఫ్గాన్​పై న్యూజిలాండ్ విజయం
  • 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన కివీస్​ జట్టు
  • అఫ్గాన్​ ఓటమితో భారత్​ సెమీస్ ఆశలు గల్లంతు
NZ vs AFG: అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ ఘన విజయం- భారత్​ సెమీస్​ అవకాశాలకు గండి

NZ vs AFG: టీ20 వరల్డ్ కప్​లో భాగంగా అబుదాబీ వేదికగా నేడు (నవంబర్ 7 ఆదివారం) అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో (New Zealand Beat Afghanistan) వేసుకుంది న్యూజిలాండ్​.

కవీస్ విజయంతో టీ20 వరల్డ్ కప్​లో టీమ్ ఇండియా సెమీస్ (team india semi final hopes closed) ఆశలు గల్లంతయ్యాయి. అప్గానిస్థాన్ గెలిస్తే.. భారత్​కు సెమీస్​ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​పై ఇండియా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అఫ్గాన్​ విఫలమవడంతో ఒక మ్యాచ్​ మిగిలి ఉండగానే  ఈ టోర్నీపై భారత్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

తొలుత బ్యాటింగ్​లో తడబడిన అఫ్గానిస్థాన్..

తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న(Afg bat firts with NZ) అఫ్గానిస్థాన్​.. కివీస్ బౌలర్ల ధాటికి డీలా పడింది. నిర్ణీణ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది.

అఫ్గాన్​ జట్టులో నజీబుల్లా(73) మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. 

Also read: Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'..

స్వల్ప లక్ష్యం కావడంతో న్యూజిలాండ్​ బ్యాటర్లు ఆధిపత్యం చూపారు. 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి విజయాన్ని ఖాతాలో వేసుకుని సేమీస్​కు చేరింది కివీస్ జట్టు.

దీనితో రేపు (సోమవారం) టీమ్ ఇండియా, నమీబియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రం కానుంది.

Also read: Afghan vs Kiwis: ఆఫ్ఘన్-కివీస్ మ్యాచ్‌పైనే టీమ్ ఇండియా ఆశలు, లేదా ఇంటికే

Also read: Ashish Nehra: 'టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్​కు అర్హతలున్నాయ్'

తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటైనా గెలిచి ఉంటే..

టీ20 వరల్డ్ కప్​లో భాగంగా భారత్​ తొలుత (India vs Pak) పాకిస్థాన్​తో, రెండో మ్యాచ్​ను న్యూజిలాండ్​తో (India vs NZ) ఆడింది. అయితే ఈ రెండు మ్యాచుల్లో భారత్​ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత అప్గానిస్థాన్​, స్కాట్​లాండ్​లతో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.

అయితే తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైనందున.. సెమీస్  చేరాలంటే.. ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా కాకుండా మొదటి రెండు మ్యాచుల్లో కనీసం ఒకదాంట్లోనైనా నెగ్గి ఉంటే.. టీమ్​ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also read: National Cricket Academy Director: ద్రవిడ్ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్?

Also read: England Vs South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం.. గెలిచినా టోర్నీ నుంచి ఔట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News