MS Dhoni: నా దూకుడు తగ్గనంత వరకు నేను ఫిట్ ఉన్నట్టే

టీమ్ ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ ధనాధన్ ధోనీ ( MS Dhoni ) గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మాంజ్రేకర్ ( Sanjay Majrekar ) ఆసక్తికరమైన విషయం షేర్ చేశాడు. 

Last Updated : Aug 8, 2020, 11:49 PM IST
MS Dhoni: నా దూకుడు తగ్గనంత వరకు నేను ఫిట్ ఉన్నట్టే

టీమ్ ఇండియా ( Team India ) మాజీ కెప్టెన్ ధనాధన్ ధోనీ ( MS Dhoni ) గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మాంజ్రేకర్ ( Sanjay Majrekar ) ఆసక్తికరమైన విషయం షేర్ చేశాడు. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) పెళ్లి వేడుకకు తను వెళ్లిన సమయంలో మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడాను అని.. అప్పుడు ధోనీ తన మాటల మధ్యలో రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు అని తెలిపాడు. సంభాషణ మధ్యలో నేను టీమ్ లో అందరికన్నా వేగంగా పరిగెత్తినంత కాలం నేను అంతర్జాతీయ క్రికెట్ లో ఆడేందుకు అర్హుడినే అనుకుంటున్నాను అని ధోని తెలిపినట్టు సంజయ్ వెల్లడించాడు.Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్ ప్యాక్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా

ధోనీ వన్నెతగ్గని క్రీడాకారుడు అని.. అతను ఇప్పటికీ టీమ్ లో ఒక కీ మెంబర్ అని.. మ్యాచును మలుపు తిప్పగల సత్తా అతని స్పెషలిటీ అని..అది శాశ్వతం అన్నాడు సంజయ్ మాంజ్రేకర్ ఈ సారి ధోనీ ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో ఆడుతూ చూడటం చాలా సంతోషకరమైన విషయం కాబోతుంది అని తెలిపాడు.COVID-19 VACCINE: ఆక్స్ ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?

Trending News