Moto G54 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో Moto G54 మొబైల్‌పై రూ. 14,750 తగ్గింపు..రూ.249కే పొందే గొప్ప డీల్ మీ కోసం..

Moto G54 Price Cut: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. Moto G54 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 23, 2024, 11:23 AM IST
Moto G54 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో Moto G54 మొబైల్‌పై రూ. 14,750 తగ్గింపు..రూ.249కే పొందే గొప్ప డీల్ మీ కోసం..

Moto G54 Price Reduced: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన డీల్‌ను అందిస్తోంది. ప్రీమియం రేంజ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను ఈ డీల్స్‌లో భాగంగా డెడ్‌ చీప్‌ ధరలకే పొందవచ్చు. ముఖ్యంగా రూ.15,000లోపే కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా  Moto G54 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో..వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Motorola గతంలో భారత్‌లో విడుదల చేసిన Moto G54 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ రెండు వేరియంట్స్‌పై ప్రత్యేక ఆఫర్స్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.21,999 కాగా.. ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా 27 శాతం తగ్గింపుతో రూ.15,999 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ Moto G54 మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 

బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే:
ఫ్లిప్‌కార్ట్‌లో Moto G54 స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం కెనరా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సిటీ బ్యాంక్‌, హెడీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కూడా 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు. ఇలా బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను కేవలం ఈ మొబైల్‌ రూ. 14,999కే పొందవచ్చు.

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా  Moto G54 మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.1,000 వరకు అదనపు బోసన్‌ కూడా పొందవచ్చు. అయితే దీని కోసం పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ. 14,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ Moto G54 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.249కే పొందవచ్చు.  

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌
 
Moto G54 5G ఫీచర్స్‌:

✦ 6.5 అంగుళాలు డిస్ప్లే
✦ 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 
✦ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
✦ MediaTek Dimensity 7020 చిప్‌సెట్
✦ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
✦ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
✦ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌
✦ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
✦ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✦ 6000 mAh బ్యాటరీ
✦ 33W వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News