Vivo T3 Price, Specifications: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో భారతీయ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. వివో కంపెనీ తమ కొత్త మోడల్ మొబైల్‌ను పరిచయం చేసింది. దీనిని కంపెనీ వివో T3 5G మోడల్ లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. మోడల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లో లాంచ్ అయింది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన సేలింగ్ ప్రక్రియను కూడా ఈరోజు నుంచే ప్రారంభించింది. ఈ మొబైల్ మొదటి సేల్‌లో భాగంగా కంపెనీ రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తో విక్రయాలను ప్రారంభించింది. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఎన్నో రకాల ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో తమ కొత్త Vivo T3 5G స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించింది. ఈ మొబైల్ అమ్మకాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ సెట్ అప్ లో డ్యూయల్ కెమెరా సిస్టంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 8gb రామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగే ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో వివో కంపెనీ దీనిని ఒక్కొక్క స్టోరేజ్ ఆప్షన్‌తో కూడిన మొబైల్‌ను ఒక్కొక్క ధరతో విక్రయిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 21,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ Vivo T3 5G మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లేదా ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.2,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ Vivo T3 5G మొబైల్‌ను రూ. 17,999కే పొందవచ్చు.
Vivo T3 5G స్పెసిఫికేషన్స్ వివరాలు:
Vivo ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన HD+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.67-అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన డిస్ప్లే స్క్రోలింగ్ కోసం కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అలాగే ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు Android 14 ఆధారంగా FuntouchOS 14 సాఫ్ట్‌వేర్ స్కిన్‌పై రన్ అవుతుంది. దీంతోపాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సెటప్ ను కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్ వివరాలు:
డిస్ప్లే:
6.58-అంగుళాల FHD+ డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంపిల్ రేట్
పనితీరు:
Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్
8GB RAM
128GB స్టోరేజ్
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్
కెమెరాలు:
50MP ప్రధాన కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
Android 12
OriginOS Ocean UI
డ్యూయల్ స్పీకర్లు
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి