Smartphone Comparison: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటుంటే వెంటనే ఆన్‌లైన్ పోర్టల్‌లోనూ.. లేదా దుకాణానికి వెళ్లి కంటికి నచ్చింది కొనడం కాదు. కొనే ముందు మొబైల్ ఫోన్‌ల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. మీ బడ్జెట్‌కు తగ్గట్టు ఏ ఫోన్ బాగుంది.. ఎందులో ఫీచర్లు బాగున్నాయి వంటివి తెలుసుకోవాలి. ఇంకొన్నిసార్లు మీ బడ్జెట్‌లోనే రెండు, మూడు ఫోన్లు ఉంటాయి. వాటి మధ్య తేడాలు తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, షియోమి 14 అల్ట్రా ఫోన్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రెండింటి ధరల మధ్య తేడా కొద్దిగా ఉన్నా ఈ రెండు ఫోన్లు మాత్రం మొబైల్‌ప్రియులను ఆకర్షిస్తున్నాయి.
భారత మార్కెట్‌లో ఇటీవల షియోమి 14, షియోమి 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశారు. ఈ ఫోన్ సిరీస్‌లు లైకా కెమెరాతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లను పొంది ఉంది. కొరియర్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్‌ను జనవరిలో విడుదల చేశారు. సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా మరింత శక్తివంతమైన ప్రాసెసర్, ప్రకాశవంతమైన డిస్ ప్లే, గూగుల్ యొక్క జెమినీ ప్రొ లాంగ్వేజ్ మోడల్ ద్వారా ఆధారితమైన ఏఐ ఆధారిత లక్షణాలను కలిగి ఉంది. షియోమి 14 అల్ట్రా, సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఈ రెండూ ఫోన్లు అధునాతన ఫీచర్లు కలిగి ఉండి మొబైల్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ రెండూ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఈ రెండింటిని చూశాక ఏది కొనాలో తెలియని పరిస్థితి ఉంటుంది.
ఈ రెండూ ఫోన్ల ఫీచర్లు, డిజైన్‌లు తదితర విభిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ ఫోన్ల మధ్య తేడాలు గమనించి ఏది ఉత్తమ ఫోన్ అని తెలుసుకోండి. ఇలా..
ఫీచర్లు ఇలా..
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా:
- 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
- 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో విలువల్స్
షియోమి 14 అల్ట్రా
- 6.8 అంగుళాల
- క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
- 1 నుంచి 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో విలువల్స్ ఉంటాయి.
బ్యాటరీ
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా:
- 45 డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్ సామర్థ్యంతో సంపూర్ణంగా 5000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.
షియోమి 14 అల్ట్రా
- 5000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 90W, 80W వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయం ఉంది.
రంగులు
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
- ప్రత్యేకమైన టైటానియం బ్లూ, ఆకుపచ్చ రంగులతోపాటు టైటానియం గ్రే, నలుపు, బూడిద రంగులతో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
షియోమి 14 అల్ట్రా
- క్లాసిక్ నలుపుతోపాటు తెలుపు వేరియంట్ రంగులలో ఫోన్లు ఉన్నాయి.
కెమెరా
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
- 200 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో అద్భుతమైన ప్రైమరీ కెమెరాను అందిస్తోంది. ఖరీదైన పెద్ద కెమెరాల మాదిరి ఫొటోలు వస్తాయి.
- సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
షియోమి 14 అల్ట్రా
- 50 మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాతో టెలిఫొటో, పెరిస్కోప్, అల్ట్రావైడ్ షాట్‌ల కోసం అద్భుతంగా ఈ కెమెరా ఉంటుంది.
- ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఈ కెమెరా అద్భుతంగా ఉంటుంది.
ప్రాసెసర్
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
- ఆక్టా కోర్ ప్రాసెసర్ కాన్ఫిగరేషన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇది క్లాక్ స్పీడ్‌లను కలిగి ఉంటుంది. 1x3.39 GHz, 3x3.1GHz, 2x2.9GHz, 2x2.2GHz.
షియోమి 14 అల్ట్రా
- అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో ఉంది. హై స్పీడ్ కోర్‌లను అందిస్తోంది. 1x3.3 GHz, 3x3.2GHz, 2x3.0GHz, 2x2.3GHz.
మెమొరి స్టోరేజీ
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
12 GB Ram, 512 GB స్టోరేజీ
షియోమి 14 అల్ట్రా
16 GB Ram, 512 GB స్టోరేజీ
ధర
సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా
రూ.1,29,999
షియోమి 14 అల్ట్రా
రూ.99,999 (గమనిక: ఫోన్ ధరల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి