Narayana On Ktr:ఆంధ్రప్రదేశ్ లో దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ల దుమారం చల్లారడం లేదు. తన వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారడం, రాజకీయ రచ్చగా మారడంతో కేటీఆర్ తర్వాత ప్రకటన ఇచ్చారు. ఏపీపై తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తన కామెంట్లపై కేటీఆర్ వివరణ ఇచ్చినా.. రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన సీపీఐ జాతీయ కార్యదర్శి.. దానికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశాడు. తమిళనాడు- ఏపీ సరిహద్దులో రెండు రాష్ట్రాల పరిధిలోని రోడ్లను చూపిస్తూ .. జగన్ పాలన ఎలా ఉందో చెప్పారు. కేటీఆర్ మాటలు నూటికి నూరు శాతం నిజమని చెప్పారు నారాయణ. అయితే ఏపీపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెనక్కి తీసుకోవడంతో.. దానిపైనా తనదైన శైలిలో స్పందించారు నారాయణ.
ఏపీకి సంబంధించి కేటీఆర్ మాట మార్చడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనే సంకేతం వచ్చేలా కామెంట్ చేశారు సీపీఐ నారాయణ. ప్రధాని మోడీ ఆదేశాలతోనే కేటీఆర్ రాత్రికి రాత్రే మాట మార్చేశారేమో అన్నారు. ఏపీలో రోడ్ల దుస్థితిని నగరిలో తాను లైవ్ లో చూపించానని చెప్పారు. తన వీడియో చూశాకే తన నియోజకవర్గంలోని రోడ్లను బాగు చేయాలని స్థానిక అధికారులను మంత్రి ఆర్కే రోజా ఆదేశించారని తెలిపారు నారాయణ. ఏపీ సీఎం జగన్ బీజేపీ డైరెక్షన్ లో పని చేస్తున్నారని కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు నారాయణ. ఈ నేపథ్యంలోనే జగన్ పాలనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇలా స్పందించారు. జగన్ కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని నారాయణ విమర్శించారు.
హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడిన కేటీఆర్... పొరుగు రాష్ట్రంలో కరెంట్ కోతలున్నాయని, రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. ఏపీలోని తన ఫ్రెండ్స్ ఈ విషయం తనకు చెప్పారని కూడా తెలిపారు. దీంతో కేటీఆర్ మాటలు ఏపీలో రచ్చ రాజేశాయి. ఏపీ గురించి కేటీఆర్ చెప్పింది అక్షర సత్యమని అక్కడి విపక్షాలు తెలిపాయి. జగన్ పాలనలో ఏపీ పరువు పోతుందని టీడీపీ ఆరోపించింది. అటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ తన రాష్ట్రం గురించి చూసుకుంటే బెటరని కౌంటరిచ్చారు. హైదరాబాద్ ఆంధ్రుల వల్లే అభివృద్ధి చెందిందంటూ కొందరు వైసీపీ నేతలు కౌంటరిచ్చారు.
READ ALSO: Yadadri Parking Fee: యాదాద్రికి కారులో వెళ్తున్నారా.. పార్కింగ్ ఫీజు తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook