హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. బంగారం స్మగ్లింగ్‌తో పాటు కొత్తగా విదేశీ కరెన్సీ, ఐఫోన్లు కూడా రవాణా అవుతున్నాయి.
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Shamshabad International Airport) యధేచ్ఛగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇప్పుడు బంగారంతో పాటు ఇతర వస్తువులు కూడా స్మగుల్ అవుతున్నాయి. తాజాగా ఒకేరోజు మూడు వేర్వేరు అక్రమ రవాణా కేసులు వెలుగు చూశాయి. ఈ మూడు వేర్వేరు కేసుల్లో బంగారం(Gold Smuggling), విదేశీ కరెన్సీ, ఐఫోన్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి శంషాభాద్ చేరుకున్న ఓ ప్రయాణీకుడి లగేజీ తనిఖీ చేయగా..అక్రమంగా తీసుకొచ్చిన 9 ఐఫోన్లు బయటపడ్డాయి. ఈ ఫోన్ల విలువ 8.37 లక్షల రూపాయలని అధికారులు నిర్ధారించారు. ఐ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు ఓ మహిళా ప్రయాణీకురాలు దుబాయ్ నుంచి నిన్న ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు(Shamshabad Airport) చేరింది. తనిఖీ చేస్తున్నప్పుడు ఆమె చేతి సంచిలోంచి మూడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 350 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 17.69 లక్షల రూపాయలని అధికారులు తేల్చారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఇదే రోజు ఇదే విమానాశ్రయంలో ఇద్దరు మహిళా ప్రయాణీకురాలు షార్జాకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. సీఐఎస్ఎఫ్ చేపట్టిన తనిఖీల్లో 55 వేల యూఏఈ ధిరామ్‌లు, 970 యూఎస్ డాలర్లు (Foreign Currency)బయటపడ్డాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు..నిందితుల్ని కస్టమ్స్‌కు అప్పగించారు. ఈ విదేశీ కరెన్సీ విలువ ఇండియాలో 11.49 లక్షలుంటుందని అధికారులు తెలిపారు.
Also read: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..రేపే అధికారిక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook