IMD Alert: వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలను రాబోయే రోజుల్లో ఎండలు బెంబేలెత్తించనున్నాయి. వచ్చే 5 రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే నార్త్ ఈస్ట్ ఇండియా, ఉత్తరాధి రాష్ట్రాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఆదివారం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రానున్న 5 రోజులు ఎండలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కోంది. తూర్పు నుంచి వీచే గాలుల కారణంగా ఏర్పడిన ద్రోణి.. ఇవాళ కర్ణాటక, మరఠ్వాడా మీదుగా విదర్భ వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే రాబోయే రెండు మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: PM Modi New Look: ప్రధాని మోదీ నయా లుక్ అదిరిందిగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook