BRS Party Celebrations: ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ ప్రతిపక్షంగాను విజయవంతంగా రాణిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయకుండా తెలంగాణకు రక్షణగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచాలని చూసిన రేవంత్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ తీవ్రస్థాయిలో పోరాటం చేసింది. విధానపరంగా.. పోరాటపరంగా పోరాడడంతో దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ఇది తాము సాధించిన విజయంగా భావించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబరాలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరగనున్న సంబరాలతో దీపావళి పండుగ ముందే వచ్చినట్టయ్యింది.
Also Read: Power Charges: తెలంగాణలో పేదలకు ఊరట.. మిడిల్ క్లాస్‌కు 'కరెంట్' షాక్
నిరంకుశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై మోపాలనుకున్న రూ.18,500 విద్యుత్ చార్జీల భారాన్ని అడ్డుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున మంగళ, బుధవారాల్లో సంబరాలు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్లల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే దానిని వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. బహిరంగ విచారణలో పాల్గొని ఈఆర్‌సీని ఛార్జీలు పెంచకుండా ఒప్పించగలిగామని కేటీఆర్ వివరించారు.
Also Read: Secretariat: సోషల్ మీడియాలో లైక్‌లు, పోస్టులు, కామెంట్లు చేయొద్దు.. పోలీసులకు ప్రభుత్వం వార్నింగ్
ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం వాదనలోని న్యాయాన్ని విని సంపూర్ణంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని శాస్త్రీయంగా ఈఆర్‌సీ ముందు ఉంచడంలో విజయం సాధించామని ప్రకటించారు.
పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈఆర్సీని కలిసి విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈఆర్‌సీ ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజలపై భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదని కొనియాడారు. ప్రజలపై భారీ విద్యుత్ గుదిబండ మోపకుండా సహకరించిన ఈఆర్‌సీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గొప్ప పోరాటంలో విజయం సాధించిన సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ చార్జీల పెంపు వెనక్కి తీసుకోవడంపై సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook