Omicron in Telangana: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. దేశంలోనూ రోజురోజుకు రెండున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం వల్ల ప్రజలతో పాటు ప్రభుత్వాల్లోనూ భయాందోళలనకు గురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతానికి పైగా ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
విదేశీ రాకపోకల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ స్థితిగతులు ఏర్పాడ్డాయని కేంద్రప్రభుత్వానికి తెలియజేస్తోంది. కానీ, ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వారిలో అధికంగా ఒమిక్రాన్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఫిబ్రవరి చివర్లో కరోనా కేసులు తెలంగాణ వ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 ఆంక్షలు పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య 50 వేలకు తాకే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ప్రజలందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మహమ్మారి నుంచి రక్షణ పొందగలమని అధికారులు సూచిస్తున్నారు. టీకా తీసుకోవడం సహా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కరోనాను నియంత్రిచవచ్చని రాష్ట్ర ఆరోగ్య అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ ఇన్ స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం.. కరోనా సోకిన వారిలో 61 శాతం మందికి అసలు లక్షణాలే లేవని తెలిపింది. కొవిడ్ బాధితులు దాదాపుగా 96 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చలి, అకాల వర్షాల కారణంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తుండడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జ్వరం సహా ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు ఇంటికే పరిమితమై చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 85 శాతం మందికి ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,047 కరోనా కేసులు, ముగ్గురి మృతి
Also Read: Bhatti vikramarka: సీఎల్పీనేత భట్టి విక్రమార్కకు కొవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook