టీఆర్ఎస్ కు ఊహించని షాక్: ఓటమిపాలైన ఇద్దరు మంత్రులు

Last Updated : Dec 11, 2018, 04:34 PM IST
టీఆర్ఎస్ కు ఊహించని షాక్: ఓటమిపాలైన ఇద్దరు మంత్రులు

తెలంగాణ ఎన్నికలు అనుహ్య పరిణామాలక వేదికగా మారింది రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ హవా నడిచినప్పటికీ   ఖమ్మం, నాగర్‌ కర్నూలు జిల్లాల్లో తెరాసకు గట్టి షాక్‌ తగిలింది. ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస సీనియర్‌ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో కేవలం దాదపు 2 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. చవిచూశారు. అలాగే నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌ నుంచి బరిలో నిలిచిన తెరాస అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్‌కు చెందిన బీరం హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 

Trending News