CPGET 2022 Results: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

CPGET 2022 Results Out Now. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) 2022 ఫలితాలు విడుదల అయ్యాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 05:32 PM IST
  • సీపీగెట్‌ ఫలితాలు విడుదల
  • రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
  • 94.39 శాతం ఉత్తీర్ణత
CPGET 2022 Results: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

Telangana CPGET 2022 Results released: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ సీపీగెట్‌ 2022 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపుగా 57 వేల మంది హాజరు కాగా.. 54,050 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 94.39శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 11 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 57,262 మంది హాజరు కాగా.. 54,050 మంది ఉతీర్ణత పొందారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని 8 వర్సిటీల పరిధిలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. 

సీపీగెట్‌ 2022 ఫలితాలు ఇలా తెలుసుకోండి:
# సీపీగెట్‌ 2022 ఫలితాల కోసం cpget.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
# హోమ్‌పేజీలో CPGET 2022 ర్యాంక్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. 
#  ర్యాంక్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. హల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయండి. 
# అప్పుడు మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. 
# ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
Also Read: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి

Also Read: Liger OTT: ఓటీటీలోకి లైగ‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News