Revanth Reddy Election Promises: యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువ సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మనకు అండగా ఉండాలనే ప్రియాంక గాంధీ వచ్చారని తెలిపారు. తెలంగాణలోని వర్సిటీలు ఆత్మగౌరవ ప్రతీకలన్నారు. 'మన రాష్ట్రం- మన కొలువులు' నినాదంతో యువతీయువకులు లాఠీ దెబ్బలు తిన్నారు, ప్రాణాలు అర్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12.50 లక్షలు. విభజన తరువాత తెలంగాణకు 5.30లక్షలు ఉద్యోగులను కేటాయించారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ పాలనలో యువతకు న్యాయం జరగదన్నారు. అందుకే నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చారు. అందులో రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు, విద్యార్ధులకు ఏమి చేయబోతుందో వివరించేందుకు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ డిక్లరేషన్ లో 5 అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు రేవంత్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిక్లరేషన్ లో తెలంగాణ పోరాడిన వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని తెలిపారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ. 25 వేల గౌరవ పెన్షన్ ఇస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేస్తామన్నారు.
కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. జూన్ 2న నోటిఫికేషన్, సెప్టెంబర్‌లో నియామక పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సరూర్ నగర్ సభ ప్రారంభానికి ముందు ఎల్బీనగర్ లోని మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతా చారి విగ్రహానికి నివాళులు అర్పించారు రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి సరూర్ నగర్ సభా స్థలి వరకు ర్యాలీగా వెళ్లారు.
Ever since KCR became the Chief Minister of Telangana after the formation of the state, he has not fulfilled his promises of providing jobs to the youth. Today, there are 2.5 lakh vacant government jobs in the state. As long as there is a BRS government, the youth and students… pic.twitter.com/CYRn534RoE
— Congress (@INCIndia) May 8, 2023
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్
అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు
• తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మరియు తల్లి/తండ్రి/భార్యకు రూ. 25000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్.
• ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత.
పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు
• మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
• మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.
• ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి.
• నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
నిరుద్యోగ నిర్మూలన
• కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన.
• విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషనన్ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.
• ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు.
ఇది కూడా చదవండి : Priyanka Gandhi Speech: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. హామీలు నెరవేర్చకపోతే మీరే కూల్చేయండి
ఫీజు రీయింబర్స్మెంట్, మెరుగైన ఉన్నత విద్య
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, EWS వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు, పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
• పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు మెదక్లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
• బాసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో 4 నూతన IIT లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం
• అమెరికాలోని IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
• పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్‌లలో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుండి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
యువ మహిళా సాధికారత
• 18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత.
ఇది కూడా చదవండి : Junior Panchayat Secretaries: అప్పుడు జేపీఎస్‌లు అందరినీ విధుల్లోకి తీసుకుంటాం: బండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK