Telangana Income: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. రైల్వే ప్రాజెక్టులతోపాటు విభజన హామీలు నిలబెట్టుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ బీజేపీ అభ్యర్థులకు ఓటలు వేసి గెలిపించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు కీలక సూచన చేశారు.
Also Read: KTR Letter To Nirmala: 'మిమ్మల్ని ప్రజలు క్షమించరు.. తెలంగాణ ముమ్మాటికి మిగులు రాష్ట్రమే!'
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు పదేళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చిందని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు. మోదీ ప్రభుత్వ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయని వెల్లడించారు.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై సంచలన ప్రకటన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ప్రకటన చేయలేదని చెప్పారు. తామే ఏర్పాటు చేస్తామని 2018లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వెల్లడించారని వివరించారు. ఈ నెల 27న జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మూడు స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందని చెప్పారు.
బీ'ఆర్ ఎస్ పట్ల వ్యతిరేకతతో గతంలో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ తమతమ ప్రసంగాలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలు, హామీలు అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శాసనమండలి ప్రాధాన్య తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 'ప్రతీవారం ఢిల్లీకి వెళ్లడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు. అక్కడి రాహుల్ మాటలను ఇక్కడకు మోసుకువచ్చి మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం తప్ప రేవంత్ రెడ్డి చేపట్టే పర్యటనల్లో మర్మం ఏమీ లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దయనీయ పరిస్థితి
రాష్ర్టంలో దయనీయ పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ ఒక్క బీసీ సంఘమైన కాంగ్రెస్ చేసిన సర్వేకు ఆమోదం తెలిపారా?అని ప్రశ్నించారు. బీజేపీ కులగణనను సమర్థిస్తుందన్నారు. బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ తో కలిసిందా? అని అడిగారు. తాము కుంభకోణాలు, అవినీతిని ఎప్పటికీ సహించబోమన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.