Bf.7 Variant Cases: కరోనావైరస్‌కి చైనానే పుట్టినిల్లు అనే వాదన మొదటి నుంచి బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ నుంచి మొదలుకుని ఇప్పుడు ఫోర్త్ వేవ్ వరకు ఏ దశలోనైనా ఎక్కువ కరోనావైరస్ పాజిటివ్ కేసులను చూసింది చైనానే. కరోనావైరస్ కారణంగా ఎక్కువ మరణాలు నమోదైంది కూడా చైనాలోనే కావడంతో చైనా అంటే కరోనావైరస్.. కరోనావైరస్ అంటే చైనా అనే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒమిక్రాన్ బిఎఫ్. 7 వేరియంట్ వ్యాప్తి విషయంలోనూ చైనానే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనాను వణికిస్తోన్న కరోనావైరస్ కొన్ని ప్రాంతాల్లో నిత్యం లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. అందులో జిజియాంగ్ ప్రావిన్స్ కూడా ఒకటి.
ఖింగ్డావ్, డాంగ్వాన్ నగరాల్లో రోజుకు 10 వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అని తెలిసినప్పుడు చైనా ఉలిక్కిపడింది. అలాంటిది ఇప్పుడు చైనాలోని జిజియాంగ్ ప్రావిన్స్‌లో నిత్యం ఏకంగా 10 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు మరింత ఆందోళన రెకెత్తిస్తోంది. షాంగైకి సమీపంలోని జిజియాంగ్ ప్రావిన్స్ చైనాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ లో ఒకటి. ఇండస్ట్రియల్ కారిడార్ కావడంతో కరోనావైరస్ సంక్రమణ కూడా భారీగానే కనిపిస్తోంది.
పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, న్యూ ఇయర్ రోజున జనం అంతా ఒక్క చోట చేరి సంబరాలు జరుపుకుంటారు కనుక ఆ తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో అనే ఆలోచనే జిజియాంగ్ అధికార యంత్రాంగానికి నిద్ర పట్టనివ్వడం లేదు. న్యూ ఇయర్ తరువాత నిత్యం 2 మిలియన్ల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని జిజియాంగ్ సర్కారు చెబుతోంది. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుండటంతో జిజియాంగ్‌లో నిత్యం జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్స్ సంఖ్య 4,08,400 గా ఉందని జిజియాంగ్ అధికార యంత్రాంగం తెలిపింది.
ఇది కూడా చదవండి : Bf.7 Variant Scare: మోగుతున్న డేంజర్ బెల్స్.. కేవలం 20 రోజుల్లో 250 మిలియన్ల మందికి కొవిడ్
ఇది కూడా చదవండి : BF.7 Variant In India: బిఎఫ్7 వేరియంట్ ఇండియాను ఏమీ చేయలేదట.. ఎందుకంటే..
ఇది కూడా చదవండి : BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎందుకంత వణికిస్తోంది ? లక్షణాలు ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook