NASA: నాసా కొత్త అస్ట్రోనాట్ టీంలో భారత సంతతి వ్యక్తి

NASA Astronauts: నాసా చేపట్టబోతున్న ఆస్ట్రోనాట్ శిక్షణా కార్యక్రమానికి తాజాగా ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపికయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డా. అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 09:56 PM IST
NASA: నాసా కొత్త అస్ట్రోనాట్ టీంలో భారత సంతతి వ్యక్తి

NASA Astronauts: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా(NASA) కొత్త అస్ట్రోనాట్ టీం(Astronaut Team)ను ప్రకటించింది. సోమవారం పది మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి పది మందిని మాత్రమే ఎంపిక చేసింది. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం రెండేళ్లపాటు సాగనుంది. ఇక ఈ బృందంలో భారత మూలాలున్న అనిల్‌ మీనన్‌(Anil Menon) ఒకరు.

అనిల్ నేపథ్యం:
2022 జనవరిలో అనిల్‌ మీనన్‌(45) నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. యూక్రేయిన్, భారతీయ మూలాలున్న డా. మీనన్(45) మిన్నెసొటా రాష్ట్రంలో జన్మించారు. అనిల్..నాసా ఫ్లయిట్‌ సర్జన్‌(NASA flight surgeon ) 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా కూడా వ్యవహరించారు ఈయన. 2018లో స్పేస్‌ఎక్స్‌(SpaceX)లో చేరిన అనిల్‌.. కంపెనీ ఫస్ట్‌ హ్యూమన్‌ ఫ్లైట్‌ ప్రిపరేషన్‌లో పాలుపంచుకున్నాడు. స్పేస్‌ఎక్స్‌ ఐదు లాంఛ్‌లకు సంబంధించి.. ఫ్లైట్‌ సర్జన్‌గా విధులు నిర్వహించారు. అత్యవసర వైద్యం, స్పేస్‌ మెడిసిన్‌ మీద ఎన్నో సైంటిఫిక్‌ పత్రాలను ప్రచురించారు. భార్య అన్నా మీనన్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: Mystery Hut on Moon: చంద్రుడి ఉపరితలంపై 'మిస్టరీ హట్'.. గుర్తించిన చైనా మూన్ రోవర్

నాసా అడ్మినిస్ట్రేటర్ బిల​ నెల్సన్‌(Bill Nelson).. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లకు ఐదు కేటగిరీల్లో శిక్షణ ఇప్పిస్తారు.

* ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం

* సంక్షిష్టమైన రొబోటిక్‌ స్కిల్స్‌ను డెవలప్‌ చేసుకోవడం

* స్పేస్‌వాక్‌ శిక్షణ

* టీ-38 ట్రైనింగ్‌ జెట్‌ను సురక్షితంగా ఆపరేట్‌ చేయడం

*  రష్యన్‌ లాంగ్వేజ్‌ స్కిల్స్‌ శిక్షణ. 

మిగిలిన 9 మంది వ్యోమగామి అభ్యర్థులు:
యూఎస్ ఎయిర్ ఫోర్స్ మేజర్. మార్కోస్ బెర్రియోస్
యూఎస్ మెరైన్ కార్ప్స్ మేజర్.(రిటైర్డ్) ల్యూక్ డెలానీ
యూఎస్ నేవీ లెఫ్టినెంట్ కమాండర్. జెస్సికా విట్నర్
యూఎస్ నేవీ లెఫ్టినెంట్. డెనిజ్ బర్న్‌హామ్
యూఎస్ నేవీ కమాండర్. జాక్ హాత్వే
క్రిస్టోఫర్ విలియమ్స్
క్రిస్టినా బిర్చ్
ఆండ్రీ డగ్లస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News