Pakistan Bans Wikipedia: పాకిస్థాన్‌లో వికీపీడియా బ్లాక్ అయింది. వికీపీడియా వెబ్‌సైట్‌లో దైవదూషణకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను వికీపీడియా తొలగించలేదని పొరుగు దేశం ఆరోపించింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ అనుచితమైన కంటెంట్‌ను తొలగించడానికి వికీపీడియాకు 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. అయితే వికీపీడియా తొలగించకపోవడంతో తమ దేశంలో బ్లాక్ చేస్తున్నట్లు షాబాజ్ ప్రభుత్వం ప్రకటించింది.
వికీపీడియా దైవదూషణ కంటెంట్‌ను తొలగించే విషయంపై కనీసం అధికారులతో మాట్లాడలేదని పాక్ మీడియా చెబుతోంది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించిన తర్వాత వికీపీడియా పునరుద్ధరణపై పునఃపరిశీలించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ చర్యకు సంబంధించి వికీపీడియాలో 'సెన్సార్‌షిప్ ఆఫ్ వికీపీడియా'పై ఒక వ్యాసం రాశారు.
చైనా, ఇరాన్, మయన్మార్, రష్యా, సౌదీ అరేబియా, సిరియా, ట్యునీషియా, టర్కీ, ఉజ్బెకిస్తాన్, వెనిజులాతో సహా దేశాల్లో వికీపీడియాపై ఇలాంటి ఆంక్షలు ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. అదే సమయంలో డిజిటల్ హక్కుల కార్యకర్త ఉసామా ఖిల్జీ ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. "నిషేధం అస్థిరమైనది. రాజ్యాంగ విరుద్ధం. చాలా హాస్యాస్పదమైనది. ఇది విద్యార్థులు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ రంగం, పరిశోధకులపై ప్రభావం చూపుతుంది. సెన్సార్‌షిప్ అనిశ్చితి, ఏకపక్షం కారణంగా పాకిస్థాన్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గిస్తుంది" అని అన్నారు.
1860లో బ్రిటిష్ వారు దైవదూషణ చట్టాన్ని రూపొందించారు. మత కలహాలను ఆపడం దీని ఉద్దేశం. తాజాగా ప్రభుత్వం దీన్ని మరింత కఠినతరం చేసింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ గత నెలలో క్రిమినల్ లా (సవరణ) చట్టం 2023ని ఆమోదించింది. ఇందులోభాగంగా ఇస్లాం మత చిహ్నాలను అవమానించే వారికి విధించే కనీస శిక్షను మూడేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచడంతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించే నిబంధన విధించారు. పాకిస్థాన్‌లో దైవదూషణ ఆరోపణలపై లక్షలాది మంది జైల్లో ఉన్నారు.
Also Read: YSRTP: బీఆర్ఎస్‌కు షాక్.. వైఎస్‌ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు
Also Read: Team India: ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook