Prashanth kishor strategy for all states to win 2024 elections to form Congress govt: 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే పీకే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచిన ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనం రపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆ పార్టీ ముఖ్య నేతలకు వివరించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు సమాచారం. అయితే తెలంగాణలో మాత్రం ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలవాలని ఆ పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2024లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లో 358 స్థానాల్లో ఒంటరిగా బరిలో నిలవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ సూచించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రశాంత్ కిషోర్ సూచించారు. జార్ఖండ్‌లో జేఎంఎం, వెస్ట్ బెంగాల్‌లో TMC, మహారాష్ట్రలో NCP, తమిళనాడులో DMK, ఆంధ్రప్రదేశ్‌లో YSRCPలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు 128 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపొందగా..249 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌లో కాంగ్రెస్ నేతలకు ప్రశాంత్ కిషోర్ వివరించారు. బీజేపీతో పోటాపోటీగా ఉండే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు. అయితే ప్రశాంత్ కిషోర్ సూచించిన పొత్తుల ప్రతిపాదనపై ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధిష్టానానికి పొత్తు పెట్టుకోవాలని సూచించడం తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం..వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు బనాయించి 16 నెలల పాటు జైలుపాలు చేసి..కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకి అని..వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని YSRCP శ్రేణులు చెప్తున్నారు. ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
వెంటిలేటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీని బతికించడం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పని చేస్తాయో లేదో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయాల్లో పొత్తులు అంటే లాభనష్టాలను ఆయా పార్టీ అధినేతలు అంచనాలు వేస్తారు. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాంగ్రెస్ నేతలకే తెలియాలి.
Also Read: Bank Holidays in May 2022: మే నెలలో 13 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు!
Also Read: CHSL Notification 2022: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. నోటిఫికేషన్ విడుదల!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.