Pregnant Woman Walks 65km: నిండు గర్భిణి.. రాత్రనక, పగలనక 65 కి.మీ కాలి నడక.. గుండె తరుక్కుపోయే ఘటన

Pregnant Woman Walks 65km: ఓ నిండు గర్భిణి ఏకంగా 65 కి.మీ నడుస్తూ తిరుపతి నుంచి నాయుడుపేటకు చేరుకుంది. నాయుడుపేటకు చేరాక నొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 07:03 AM IST
  • కాలినడకన 65 కి.మీ ప్రయాణించిన గర్భిణి
  • తిరుపతి నుంచి నాయుడుపేట వరకు
  • ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బంది
  • ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన వైనం
 Pregnant Woman Walks 65km: నిండు గర్భిణి.. రాత్రనక, పగలనక 65 కి.మీ కాలి నడక.. గుండె తరుక్కుపోయే ఘటన

Pregnant Woman Walks 65km: ఆమె ఓ నిండు గర్భిణి... ప్రసవం తేదీ దగ్గరపడింది... చేతిలో చిల్లిగవ్వ లేదు.. పైగా నిత్యం ఆమెతో భర్త పోరు.. అతని తీరుతో పూర్తిగా విసిగిపోయింది.. ఇంటి నుంచి బయటకొచ్చేసింది.. అలా ఒంటరిగా ఏకంగా 65 కి.మీ నడిచేసింది. ఇంతలో పురిటి నొప్పులు మొదలయ్యాయి... దారిలో కనిపించినవారిని సహాయం చేయాలని వేడుకుంది. ఎవరూ ఆమె గోడు వినిపించుకోలేదు. చివరకు ఓ వ్యక్తి సాయంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆమె వద్దకు చేరుకున్నారు. అప్పటికే బిడ్డ కిందకు జారిపోవడంతో.. ఆమెకు ప్రసవం చేశారు. అత్యంత నీరసంగా ఉన్న ఆమె పరిస్థితి చూసి ఆ సిబ్బంది చలించిపోయారు. తిరుపతిలోని నాయుడుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుపతికి చెందిన ఆ గర్భిణి భర్త పోరు భరించలేక కాలి నడకన 65 కి.మీ దూరం నడిచి నాయుడుపేటకు చేరుకుంది. రెండు రోజులు పగలనక, రాత్రనక నడుస్తూనే ఉంది. శుక్రవారం (మే 13) అర్ధరాత్రి సమయంలో నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరిన సమయంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చేతిలో డబ్బు లేదు.. తెలిసినవారెవరూ లేరు... ఏం చేయాలో తెలియని స్థితిలో రోడ్డుపై వెళ్లే వాహనదారులను సాయం చేయాలని వేడుకుంది. ఎవరూ ఆమె పట్ల కనికరం చూపలేదు. చివరకు, ఎట్టకేలకు ఓ యువకుడు స్పందించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను వాహనంలోకి ఎక్కించారు. బిడ్డకు కిందకు జారిపోవడంతో వెంటనే ప్రసవం చేశారు.

రెండు రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేదని తెలిసి చలించిపోయారు. పాలు, బ్రెడ్ తెప్పించి ఆమెకు తినిపించారు. తమ ఇళ్ల నుంచే దుస్తులు తీసుకొచ్చి ఇచ్చారు. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. తమది రాజమహేంద్రవరం అని... బతుకుదెరువు కోసం తిరుపతిలో ఉంటున్నామని... తన పేరు వర్షిణి అని ఆ మహిళ 108 సిబ్బందితో చెప్పింది. అంతకుమించి, ఏ వివరాలు వెల్లడించలేదు. 108 సిబ్బంది దిశ పోలీసులకు సమాచారమివ్వడంతో ఆమె పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. 

Also Read: Andrew Symonds Died: ఆస్ట్రేలియా క్రికెట్ లో వరుస విషాదాలు.. కారు ప్రమాదంలో చనిపోయిన ఆండ్రూ సైమండ్స్

Also Read: Horoscope Today May 15 2022: రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News