YS Sharmila on Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదు.. బీహార్ ఎన్నికల బడ్జెట్ అని అన్నారు. బీహార్‌ను అందలం ఎక్కించి ఏపీకి గుండుసున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. హోదా ప్రస్తావన లేకుండా ప్రజల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగినా.. సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.
"భారత్ బడ్జెట్(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు "కొండంత రాగం తీసి కూసంత పాట" పాడినట్లుంది. NDA భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న నితీష్ గారు బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మోడీ గారు చిప్ప చేతిలో పెట్టారు. బీహార్‌ను అందలం ఎక్కించి, ఆంధ్రకు గుండు సున్నా ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు.
బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారు. రాజధాని అమరావతికి గతంలో ఇచ్చిన రుణం తప్పా.. ఇప్పుడు రూపాయి సహాయం లేదు. పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం లేదు. విభజన హామీలను తుంగలో తొక్కారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమలు కేటాయించలేదు. మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. కడప స్టీల్ ఊసే లేదు.
రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఏపీకి ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. అవసరం ఉన్నంత సేపు ఓడమల్లన్న... గట్టెక్కాక బోడి మల్లన్న..రాష్ట్ర ప్రజలను మోడీ గారు బోడి మల్లన్న కింద లెక్క గట్టారు. చంద్రబాబు గారి నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న ఉదాసీనత ఈ బడ్జెట్‌తో తేటతెల్లం అయ్యింది. ఇంత అన్యాయం జరిగితే చంద్రబాబు గారు బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదం." అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
Also Read: Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook