Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!

Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 1, 2025, 03:00 PM IST
Budget 2025 Live Updates: ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్..!
Live Blog

Budget 2025 Live Updates: ఎన్నో అంచనాలు.. మరోన్నో ఆశల నడుమ కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు..? ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్‌లో ఉపశమనం కలుగుతుందా..? ఉద్యోగుల డిమాండ్స్‌పై ప్రకటనలు ఉంటాయా..? మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరేలా బడ్జెట్ ప్రసంగం ఉంటుందా..? ఇలా ఎన్నో అంచనాలతో ఈసారి బడ్జెట్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఇప్పుడు 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 

 

1 February, 2025

  • 15:00 PM

    Budget 2025 Highlights: 2005 నుంచి ఆదాయ పన్ను శ్లాబులిలా..!

    ==> 2005: రూ.1 లక్ష
    ==> 2012: రూ.2 లక్షలు
    ==> 2014: రూ.2.5 లక్షలు
    ==> 2019: రూ.5 లక్షలు
    ==> 2023: రూ.7 లక్షలు
    ==> 2025: రూ.12 లక్షలు

  • 14:58 PM

    Budget 2025 Highlights: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు

    కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూ.50.65 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. 

    రంగాల వారీగా చూస్తే..

    ==> వడ్డీలు- రూ.12.76 లక్షల కోట్లు
    ==> రవాణా- రూ.5.48 లక్షల కోట్లు
    ==> రక్షణ రంగం రూ.4.91 లక్షల కోట్లు
    ==> మేజర్ సబ్సిడీలు- రూ.3.83 లక్షల కోట్లు
    ==> పెన్షన్లు- రూ.2.76 లక్షల కోట్లు
    ==> గ్రామీణాభివృద్ధి- రూ.2.66 లక్షల కోట్లు
    ==> హోంశాఖ- రూ.2.33 లక్షల కోట్లు

  • 14:42 PM

    Budget 2025 Highlights: కేంద్ర బడ్జెట్‌పై బండి సంజయ్ స్పందించారు. రూ.12 లక్షల వరకు ట్యాక్స్‌ మినహాయింపు ఇవ్వడం చాలా మంచి పరిణామం అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 14:23 PM
  • 13:07 PM

  • 12:52 PM
  • 12:43 PM

  • 12:36 PM

    Budget 2025 Highlights: గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్‌న్యూస్

    ==> గ్రిగ్‌వర్కర్లకు గుర్తింపు కార్డులు 
    ==> పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
    ==> ఈ-శ్రమ్ పోర్టల్ కింద వీరి వివరాలు నమోదు
    ==> కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం 

  • 12:33 PM

    Budget 2025 Highlights: కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌ల వివరాలు ఇలా..

    ==> రూ.0-4 లక్షలు - సున్నా
    ==> రూ.4-8 లక్షలు - 5 శాతం
    ==> రూ.8-12 లక్షలు - 10 శాతం
    ==> రూ.12-16 లక్షలు - 15 శాతం
    ==> రూ.16-20 లక్షలు - 20 శాతం
    ==> రూ.20-24 లక్షలు - 25 శాతం
    ==> రూ.24 లక్షల పైన 30 శాతం

  • 12:24 PM
  • 12:15 PM

    Budget 2025 Highlights: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.
     

  • 12:13 PM

    Budget 2025 Highlights: వచ్చే వారం ఆదాయపు పన్నుపై కొత్త బిల్లు వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 12:12 PM

    Budget 2025 Highlights: బడ్జెట్‌లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధాన్య యోజనను ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
     

  • 12:11 PM

    Budget 2025 Highlights: సీనియర్ సిటిజన్స్‌కు టీడీఎస్‌ మినహయింపు

    ==> రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు

    ==> అప్‌డేటెట్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగింపు

    ==> 82 అంశాలపై సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జీ ఎత్తివేత

  • 12:01 PM

    Budget 2025 Highlights: అస్సాంలో కొత్త యూరియా ప్లాంట్ ఏర్పాటు

    ==> ఏడాది 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్సాదనే లక్ష్యం

  • 11:59 AM
  • 11:58 AM

    Budget 2025 Highlights: అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత్ ట్రేడ్ నెట్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు..

    ==> అధిక విలువైన పాడైపోయే ఉద్యానవన వస్తువుల కోసం ఎయిర్ కార్గో వేర్‌హౌసింగ్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వ సహకారం
     

  • 11:56 AM

    Budget 2025 Highlights: నేషనల్ స్పేషియల్ మిషన్‌ ప్రకటన.. భవిష్యత్‌లో ఆహారం, పోషకాహార భద్రత కోసం ప్రభుత్వం 10 లక్షల జెర్మ్‌ప్లాజంతో రెండవ జన్యు బ్యాంక్‌ ఏర్పాటు

  • 11:55 AM

    Budget 2025 Highlights: రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రభుత్వం టాప్‌ 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి 

    ==> హోమ్‌స్టేల కోసం ముద్రా రుణాలను అందజేస్తాం..
    ==> మెడికల్ టూరిజం ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ప్రచారం

  • 11:53 AM

    Budget 2025 Highlights: "జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొత్తం వ్యయం పెరుగుతుంది.

  • 11:50 AM
  • 11:49 AM

    Budget 2025 Highlights: బీమా రంగానికి 100 శాతం ఎఫ్‌డీఐకి ఆమోదం 

    ==> పర్యాటకాన్ని పెంచేందుకు బుద్ధా సర్క్యూట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

  • 11:47 AM

    Budget 2025 Highlights: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన

  • 11:46 AM

    Budget 2025 Highlights: డిస్కమ్‌ల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు విద్యుత్ పంపిణీ సంస్కరణలను, అంతర్రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తాం..

    ==> విద్యుత్ పంపిణీ, ప్రసార సంస్థలను బలోపేతం చేయడానికి జీడీపీలో అదనంగా 0.5 శాతం రుణం తీసుకోవడానికి అనుమతి

  • 11:44 AM

    Budget 2025 Highlights: 100 శాతం కవరేజీ సాధించేందుకు జల్ జీవన్ మిషన్ బడ్జెట్ వ్యయం పెంపు. 

    ==> కొత్త ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చేందుకు అసెట్ మానిటైజేషన్ స్కీమ్ 2025-30 ప్రారంభం

  • 11:43 AM

    Budget 2025 Highlights: కూరగాయలు, పండ్ల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు..

    ==> లాభసాటి ధరలను అందించేందుకు సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం..

  • 11:42 AM

    Budget 2025 Highlights: అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు 

    ==> పట్టణ కార్మికుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని అమలు
    ==> వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు

  • 11:39 AM

    Budget 2025 Highlights: యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు

    ==> అంతర్జాతీయ నైపుణ్యంతో 5 జాతీయ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు 
     

  • 11:38 AM

    Budget 2025 Highlights: శ్రీ కృష్ణ భగవానుడి భక్తురాలు.. సంగీతాన్ని ఇష్టపడే తత్వం.. నిర్మలా సీతారామన్‌ గురించి చాలా మందికి తెలియని విషయాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
     

  • 11:36 AM

    Budget 2025 Highlights: క్లీన్ టెక్నాలజీ తయారీకి సప్టోర్ట్‌గా మిషన్‌ను ప్రారంభం

    ==> అణుశక్తి అభివృద్ధికి ప్రైవేటు రంగానికి సహకారం.. అణుశక్తి మిషన్‌కు ఏర్పాట్లు

    ==> ఏఐ సెంటర్‌ను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయింపు

    ==> లెదర్ ఇండస్ట్రీ స్కీమ్ కింద 22 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం.. 

  • 11:34 AM

    Budget 2025 Highlights: పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

  • 11:32 AM

    Budget 2025 Highlights: ధన్‌ధాన్య యోజనతో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి.

    ==> దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం.

    ==> గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన.

    ==> పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం.

    ==> కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం.

    ==> పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం.

  • 11:30 AM

    Budget 2025 Highlights: ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు.. బిహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫుడ్ టెక్నాలజీ, మఖానా బోర్డ్..

    ==> రూ.30 వేలతో స్ట్రీట్ వెండర్స్‌కు క్రెడిట్ కార్డులు

  • 11:28 AM

    Budget 2025 Highlights: ఐఐటీ పాట్నావిస్తరణకు నిర్ణయం

    ==> విద్యారంగంలో AI వినియోగం
    ==> అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
    ==> పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థులకు సంఖ్య రెట్టింపు

  • 11:26 AM

    Budget 2025 Highlights: కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంపు

    ==> KCC ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

  • 11:24 AM

    Budget 2025 Highlights: ప్రపంచ బొమ్మల హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ప్రణాళికను ప్రారంభించనున్నారు. 

    ==> పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యత 

    ==> అధిక నాణ్యత గల పర్యావరణ అనుకూలమైన బొమ్మలు లభిస్తాయి.

  • 11:22 AM

    Budget 2025 Highlights: ఎంఎస్‌ఎంఈలను మరింత విస్తరించడంలో సహాయపడేందుకు వారితో పరిమితిని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనివల్ల ఉపాధి ఏర్పడుతుందన్నారు. లోన్ రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌ల లోన్ రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నామన్నారు.

  • 11:20 AM

    Budget 2025 Highlights: సహకార సంఘాల ద్వారా ఎన్‌సీడీసీకి ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

  • 11:18 AM

    Budget 2025 Highlights: 2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం.

    ==> పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక

    ==> ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య యోజన

  • 11:15 AM

    Budget 2025 Highlights: ది పవర్ ఆఫ్‌ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక అని చెప్పారు.

  • 11:12 AM

    Budget 2025 Highlights: వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీరో పేదరికమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. 6 రంగాల్లో సమూల మార్పులు చేస్తున్నామన్నారు.

  • 11:06 AM

    Budget 2025 Highlights: తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. రాసిన రచనలు గుర్తు చేసుకుంటూ నిర్మలా సీతారామన్ ప్రసంగం మొదలుపెట్టారు.

  • 11:03 AM

    Budget 2025 Live Updates: నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతల నినదాల నడుమ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.

  • 10:59 AM

    Budget 2025 Live Updates: నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు.  పార్లమెంట్ హౌస్‌లో మోదీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సాధారణ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

  • 10:39 AM
  • 10:24 AM

    Budget 2025 Live Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా అభినందనలు తెలిపారు. పంజాబ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు మెమోరాండం ఇచ్చామన్నారు MSP చట్టపరమైన హామీని కూడా తాము కోరుతున్నామన్నారు. 

Trending News