కత్రీనా కైఫ్‌ వివాహమా.. నాకేం తెలియదు! పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్

కత్రీనా కైఫ్‌ వివాహమా.. నాకేం తెలియదు విక్కీ కౌశ‌ల్ పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్‌ పెళ్లికి ఆహ్వానం అంద‌లేదు  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 11:55 AM IST
  • కత్రీనా కైఫ్‌ వివాహమా.. నాకేం తెలియదు
  • విక్కీ కౌశ‌ల్ పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు
  • విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్‌ పెళ్లికి ఆహ్వానం అంద‌లేదు
కత్రీనా కైఫ్‌ వివాహమా.. నాకేం తెలియదు! పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్

Kiara Advani says I have not been invited Katrina Kaif and Vicky Kaushal's wedding: బాలీవుడ్ ప్రేమ జంట‌ విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్ వివాహం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అన్న విషయం తెలిసిందే. డిసెంబ‌ర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌ (Sawai Madhopur)లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుందని సమాచారం తెలుస్తోంది. లవ్‌ బర్డ్స్‌ వివాహం కోసం ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయట. అయితే ఈ వివాహం గురించి విక్కీ, క‌త్రినా (Kaif and Vicky) అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ పెళ్లికి ఎవ‌రు వెళ్తారు అనేదానిపై కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇండస్ట్రీ నుంచి కొద్దిమంది సెల‌బ్రిటీలు మాత్రమే హాజ‌రయ్యే అవ‌కాశం ఉందని సమాచారం తెలుస్తోంది. 

ఇప్ప‌టికే ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకున్న విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్ (Katrina Kaif and Vicky Kaushal).. త‌మ సంప్ర‌దాయ‌ల ప్ర‌కారం డిసెంబ‌ర్ 9న మరోసారి వివాహం చేసుకోనున్నారట. ఈ వివాహానికి ఇండ‌స్ట్రీలో క్లోజ్‌గా ఉన్న‌వాళ్ల‌ను మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. లస్ట్ స్టోరీస్ సినిమాలో విక్కీ కౌశ‌ల్‌తో నటించిన బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani).. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పెళ్లిపై స్పందించారు. పెళ్లికి విక్కీ మిమ్మ‌ల్ని ఆహ్వానించారా? అని మీడియా అడగ్గా... 'నిజంగానా ?. ఈ వార్తలు నేను కూడా విన్నాను. కానీ నాకేం తెలియదు. నన్నైతే ఇప్పటివరకు ఎవరూ ఆహ్వానించలేదు. కత్రీనా కైఫ్‌ మాట్లాడి చాలా రోజులైంది' అని కియారా సమాధానం ఇచ్చారు. 

Also Read: IND vs SA: అజింక్య రహానేపై వేటు.. ఇక టెస్ట్‌ వైస్‌ కెప్టెన్సీ కూడా అతడికే! దక్షిణాఫ్రికా సిరీస్ ఆలస్యం!!

విక్కీ కౌశ‌ల్‌తో కలిసి నటించడం ఎలా ఉంది అని కియారా అద్వానీ ((Kiara Advani))ని ప్రశ్నించగా... 'విక్కీ కౌశ‌ల్ చాలా మంచి వ్య‌క్తి. ఎంతో సరదాగా ఉంటాడు. అత‌డితో వ‌ర్క్ చేయ‌డం నాకు చాలా హ్యాపీగా ఉంది' అని వెల్ల‌డించారు. ల‌స్ట్ స్టోరీస్ సినిమాలో విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి కియారా నటించారు. తాజాగా 'గోవింద నామ్ మేరా' అనే సినిమాలో కౌశ‌ల్ స‌ర‌స‌న కియారా నటిస్తున్నారు. కియారా, విక్కీ మంచి ఫ్రెండ్స్‌. అయినప్పటికీ త‌న పెళ్లికి కియారాను పిల‌వ‌క‌పోవ‌డం ఆశ్చర్యం కలిగించే అంశమే. పెళ్లికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు పిలుపు వెళ్ళొచ్చేమో. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు కూడా ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని సమాచారం. 

Also Read: AdaviThalliMaata: 'సెప్తున్న నీ మంచి సెడ్డ.. అంతోటి పంతాలు పోవాకు బిడ్డ' బీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్

డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్ వివాహం ( Katrina Kaif and Vicky Kaushal's wedding) జరగనుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ చాలా ప్రైవేట్‌గా ఈ పెళ్లి జరగనుందట. పెళ్లి వేదిక, రిసెప్షన్ వివరాలు, గెస్ట్ లిస్ట్ లాంటి సమాచారం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్‌ 4 నుంచి 12 మధ్య వివాహ కార్యక‍్రమాలు నిర‍్వహించే అవకాశం ఉందట. డిసెంబర్‌ 7న 'సంగీత్‌', 8న 'మెహందీ', 9న పెళ్లి, 10న రిసెప్షన్‌ ఉన్నట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News