Ram Gopal Varma Dangerous రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో..ఎప్పుడు పోతోన్నాయో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతీ సినిమా ముందు వర్మ చేసే కాంట్రవర్సీలు మాత్రం మామూలుగా ఉండవు. ఎన్ని రకాలుగా వర్మ ప్రయత్నించినా.. ఆడియెన్స్ మాత్రం ఆయన సినిమాలను ఆదరించడం లేదు. జనాలు ఆదరించడం లేదు కదా? అని సినిమాలు తీయడం మాత్రం ఆగడం లేదు. తనకు నచ్చినట్టుగా ఏవేవో పిచ్చి చిత్రాలను తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వర్మ డేంజరస్ అనే సినిమాతో రాబోతోన్నాడు.
ఇండియన్ స్క్రీన్ మీద తొలిసారిగా లెస్బియన్ సినిమాను తీస్తున్నానంటూ వర్మ రచ్చ రచ్చ చేస్తున్నాడు. నైనా గంగూలి, అప్సరా రాణిలతో కలిసి వర్మ తీసిన ఈ చిత్రం ఈ వారమే థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ లెస్బియన్ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అంతా కూడా సోషల్ మీడియాలో మంటలు పుట్టించేసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ ఇరవై మంది అమ్మాయిలతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అమ్మాయిలు రకరకాల ప్రశ్నలు వేస్తే.. వాటికి తన స్టైల్లో సమాధానాలు ఇచ్చాడు వర్మ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook