Easy Weight Loss Tips: ఏం చేసినా బరువు తగ్గడం లేదని, ఎన్ని కసరత్తులు చేసినా ప్రయోజనం లేదని లోలోనే ఆందోళన చెంది ఆ ఆందోళన కారణంగా హార్మోన్ల సమతుల్యత కరునై మరింత బరువు పెరుగుతుంటారు. కానీ లైఫ్ స్టైల్లో సరైన మార్పులు చేసుకుని ఒక క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగిస్తే.. శరీరంలో కొవ్వు కరిగి, అధిక బరువు తగ్గి నాజూగ్గా, ఫిట్‌గా తయారవడం పెద్ద కష్టమైన పనేమీ కాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
పచ్చి వెల్లుల్లితో బోలెడన్ని లాభాలు..
అధిక బరువు తగ్గడం కోసం చేయాల్సిన కసరత్తులు అన్నీ చేసినా లాభం లేదనుకునే వాళ్లు.. ఆ ప్రయత్నాలను అలా కొనసాగిస్తూనే ఖాలీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. వెల్లుల్లితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి అధిక బరువు తగ్గడం కాగా.. రెండోది వెల్లుల్లిలో ఉండే ఇమ్యూనిటీ బూస్టర్స్ కారణంగా శరీరం కూడా ఆరోగ్యంగా, ఎంతో ఫిట్‌గా ఉంటుంది. శక్తిని పుంజుకునేందుకు సైతం వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
వెల్లుల్లితో ఉన్న మరో ప్రయోజనం..
వెల్లుల్లితో అధిక బరువు తగ్గేందుకు మరో కారణం ఉంది. పచ్చి వెల్లుల్లికి అధిక కొవ్వును కరిగించే గుణం ఉండటంతో పాటు.. ఆకలిని నిరోధించి అతిగా తినకుండా చేస్తోంది. దీని వల్ల ఆహారాన్ని అమితంగా తీసుకునే వారికి చక్కటి పరిష్కారం లభించినట్టవుతుంది. ఒంట్లోంచి విషపూరితమైన టాక్సిన్స్‌ని బయటికి పంపించేందుకు కూడా పచ్చి వెల్లుల్లి శరీరానికి సహకరిస్తుంది.
తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
నిత్యం రెండు రెబ్బల పచ్చి వెల్లుల్లి తీసుకుంటే పర్వాలేదు కానీ మోతాదుకు మించి ఎక్కువ తీసుకుంటే కడుపులో మంట రావచ్చు.
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు మోతాదుకు మించి వెల్లుల్లి తీసుకుంటే గుండెలో మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొంతమందికి రెగ్యులర్‌గా పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఛాతిలో మంటగా అనిపిస్తుంది.
పచ్చి వెల్లుల్లి పడని వారికి దురద, ముక్కులోంచి నీరు కారడం, కళ్లు, ముక్కుకు దురద సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఎవరెవరు వెల్లుల్లి తినకూడదు
గర్భిణిలు, పిల్లలు, లో బీపీ పేషెంట్స్ వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిది.
రక్తస్రావం అధికంగా ఉండే పేషెంట్స్, మధుమేహంతో బాధపడే వారు సైతం వెల్లుల్లికి దూరంగా ఉండటమే బెటర్.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఆరోగ్య సూత్రాలు ఒక ఆరోగ్య సలహాగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది కానీ ఇదే అంతిమ నిర్ణయం కాదని గ్రహించండి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించిన తర్వాత వారి సూచనల మేరకే నడుచుకోవడం ఉత్తమం.
Also Read : Fig Side Effects: అంజీర్‌ను అతిగా తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..
Also Read : Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారికి గుడ్ న్యూస్.. రోజూ ఇలా చేయండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి