Overhydration Side Effects: ఈ వేసవికాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా ఏదో ఎడారిలో ఉంటున్నట్టే అనిపిస్తుంది. ప్రతిరోజు అంత భారీ స్థాయిలో.. ఎండలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం ముందుగా అందరూ చెప్పే చిట్కా మంచినీళ్లు ఎక్కువ తాగమని. అసలే వేసవికాలం కాబట్టి శరీరానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం కాబట్టి.. మన శరీరం డీహైడ్రేట్ అయిపోకుండా మనమే కాపాడుకోవడానికి తగినన్ని మంచినీళ్లు తాగాల్సి ఉంటుంది.
సరిపడా మంచినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కావాల్సిన దానికంటే మంచినీళ్లు తక్కువ తాగితే, బాడీ ఓవర్ హైడ్రేట్ అయిపోయి వేరే అనారోగ్యాలు మొదలవుతాయి. అయితే మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.
అసలు ఎండాకాలం కాబట్టి ఎప్పటికప్పుడు మంచి నీళ్లు తాగుతూనే ఉంటాం. మన శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు ఆహారాలు కూడా తీసుకుంటే కూడా చాలా మంచిది. కానీ ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటర్ అతిగా తాగడం వల్ల కూడా బోలెడు ఇబ్బందులు వస్తాయట.
నీళ్లు ఎక్కువ తాగడం వల్ల పెను ప్రమాదాలు:
వాటర్ సరిగ్గా తాగకుండా డిహైడ్రేట్ అయిన దానికంటే.. వాటర్ ఎక్కువగా తాగి ఓవర్ హైడ్రేట్ అయిన వారిలో .. ఎక్కువ ప్రమాదం ఉంటుంది అని ఒక సర్వే వెల్లడిచ్చింది. కావాల్సిన మంచినీళ్ల కంటే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మన మెదడు పనితీరు కూడా తగ్గుతుందట. మంచినీళ్లు ఎక్కువగా తాగితే.. మన శరీరం ఎక్కువ నీటి శాతాన్ని విసర్జించడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల కండరాలు తిమ్మిరి ఎక్కడం.. బలహీనంగా అనిపించడం వంటివి జరుగుతూఉంటాయి.
తాగాల్సిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగితే మన శరీరంలోని ఎలక్ట్రోలైట్ శాతం లో కూడా అసమతుల్యత వస్తుంది. ఎక్కువగా మంచినీళ్లు తీసుకోవడం వల్ల మనం కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట. అవసరానికి మించి మంచినీళ్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల.. ఇలాంటి ముప్పులు రావచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
ఇలా తక్కువ వాటర్ తాగినప్పుడే కాకుండా.. ఎక్కువ వాటర్ తాగినా కూడా ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి వేసవి కాలం అయినప్పటికీ.. మంచినీళ్లు కూడా మోతాదులోనే తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది.
Also Read: Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఫేక్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్?
Also Read: Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు 'గాడిద గుడ్డు' తప్ప: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter