కొవ్వు శరీరంలో ఏ భాగంలో అయినా పేరుకునే అవకాశం ఉంటుంది. కానీ పొట్టలోని కొవ్వు ( Fat ) మాత్రం కరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మీరు ఈ జ్యూస్ తాగడం ప్రారంభించండి.
ఇందులో నిమ్మరసం ( Lemon ), బెల్లం (Jaggery ) కలిపితే సరిపోతుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బరువు తగ్గుతుంది. ఆరోగ్యానికి ( Health ) ఎన్నో లాభాలు కలుగుతాయి. ఒక గ్లాసు నిమ్మకాయతో నీరసం దరిచేరదు.
బెల్లం అనేది పంచదారకు ప్రత్యామ్నాయం అని అందరికీ తెలిసిందే. ఇందులో జింక్, సెలెనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుంచి విషతుల్యాలు తొలగిపాతాయి. శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది.
ఈ జ్యూస్ ను తయారు చేసే విధానం
- ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి.
- ఇందులో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి.
- ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేయండి.
- బెల్లం పొడి కలిపి బాగా మిక్స్ చేయండి.
- పొట్టలోని కొవ్వును తగ్గించే డ్రింక్ రెడీ.
నటి రియా చక్రవర్తి చిన్ననాటి అరుదైన ఫోటోలు
Smart Mobile : మన దేశంలో ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
రోజు ఉదయం లేవగానే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల పొట్టలోని కొవ్వు తగ్గుతుంది.