7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. 7వ వేతన సంఘం ప్రకారం జూలైలో పెరగాల్సిన రెండవ విడత డీఏ కోసం చూస్తున్నారు. మరోవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కూడా స్పష్టత రానుంది. ఈ ఏడాది దీపావళికి ముందే పెరిగిన జీతం అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరగనుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీపావళికి ముందే డీఏ పెంపు ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం డీఏ రూపంలో అందుతోంది. జనవరిలో పెరగాల్సిన తొలి విడత 4 శాతంతో 50 శాతమైంది. ఇప్పుడు రెండో విడతలో భాగంగా 3-4 శాతం పెరుగుతుందనే అంచనా ఉంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఇదే చెబుతోంది. ఎందుకంటే డీఏ పెంపు అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగానే నిర్ణయిస్తుంటారు. కోటికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ డీఏ పెంపు ద్వారా లబ్ది పొందనున్నారు. ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయలుంటే ప్రస్తుతం డీఏ రూపంలో 9 వేలు అందుతున్నాయి. ఇప్పుడు 3 శాతం డీఏ పెరిగితే నెలకు 540 రూపాయలు పెరగనుంది. అదే 4 శాతం పెరిగితే మాత్రం మొత్తం డీఏ 9,720 రూపాయలు ఏడాదికి పెరగనుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ 12 నెలల సరాసరి ఆధారంగా డీఏ పెంపు అనేది నిర్ణయమౌతుంది. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల ప్రకారం ఇది ఉంటుంది. ద్రవ్యోల్బణం తట్టుకునేందుకు డీఏ పెంపు అనేది అనివార్యం. ఎంత పెరుగుతుందనేది ఇంకా అధికారికంగా తెలియకపోయినా దీపావళి కంటే ముందే డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది. జనవరి డీఏ పెంపు ప్రకటన ఈ ఏడాది మార్చ్ నెలలో వెలువడగా మూడు నెలల ఎరియర్లతో సహా చెల్లించారు. అదే విధంగా జూలై ప్రకటన అక్టోబర్ నెలలో వెలువడనుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఎరియర్లతో సహా అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. అదే విధంగా పెన్షనర్లకు డీఆర్ పెరగనుంది.
ఇక 8వ వేతన సంఘం ఏర్పాటు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇంకా చర్చల దశలోనే ఉంది. 7వ వేతన సంఘం పరిమితి 2026తో పూర్తవుంది. వేతన సంఘం ఏర్పడి అమల్లో వచ్చేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. అందుకే ఇప్పట్నించే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.
Also read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.