Crime Against Women: మహిళలపై నేరాల్లో దేశంలోనే ఢిల్లీ టాప్... ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నగరాలివే..

Crime Against Women NRCB Data: మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశ రాజధాని ఢిల్లీ టాప్‌లో ఉంది. గతేడాది ఢిల్లీలో మహిళలపై 13,892 నేర ఘటనలు చోటు చేసుకున్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 30, 2022, 10:40 AM IST
  • మహిళలపై నేరాల్లో ఢిల్లీ టాప్
  • దేశంలోనే అత్యధికంగా మహిళలపై నేరాలు
  • నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ఇదే
Crime Against Women: మహిళలపై నేరాల్లో దేశంలోనే ఢిల్లీ టాప్... ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నగరాలివే..

Crime Against Women NRCB Data: మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశ రాజధాని ఢిల్లీ టాప్‌లో ఉంది. గతేడాది ఢిల్లీలో మహిళలపై 13,892 నేర ఘటనలు చోటు చేసుకున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఢిల్లీలో మహిళలపై నేరాలు 40 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 19 మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో 32.20 శాతం కేసులు ఢిల్లీలోనే నమోదవడం గమనార్హం. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటాతో ఈ విషయం వెల్లడైంది.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం.. మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 13,892 కేసులు నమోదవగా ఇందులో 3948 కిడ్నాప్ కేసులు, భర్తల చేతిలో చిత్రహింసలకు గురైన కేసులు 4674, మైనర్ బాలికలపై రేప్ కేసులు 833 ఉన్నాయి. సగటున ప్రతీరోజూ ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. కట్నం వేధింపులతో మృతి చెందిన కేసులు 136 నమోదయ్యాయి. ఇక మహిళల పరువుకు భంగం కలిగించేలా వారిపై దాడులకు పాల్పడిన కేసులు 2022 నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద 1357 కేసులు నమోదయ్యాయి

మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న 19 మెట్రో నగరాల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 43,414 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తర్వాత మహిళలపై అత్యధిక నేరాలు నమోదైన నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ముంబైలో 12.76 శాతం, బెంగళూరులో 7.2 శాతం కేసులు నమోదయ్యాయి. 

Also Read: Horoscope Today August 30th 2022: నేటి రాశి ఫలాలు.. పట్టరాని కోపం ఈ రాశి వారి రిలేషన్‌షిప్‌కి శత్రువుగా మారే ఛాన్స్..

Also Read: TS Inter Supplementary Results 2022: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News