Dense fog grips north India: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. రోడ్లపై విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు.
గంగానగర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, పాలం, సఫ్దర్‌జంగ్, బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ మరియు తేజ్‌పూర్‌లు ఈ శీతాకాలంలో మొదటిసారిగా జీరో మీటర్ విజిబిలిటీని నమోదు చేశారు. ఇది ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారింది. పూర్నియా, దిబ్రూఘర్, కైలాషహర్ మరియు అగర్తల వంటి ప్రాంతాల్లో దృశ్యమానత 25 మీటర్లకు పడిపోయింది. హైవేలపై ప్రయాణించే వారు తమ ప్రయాణాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మరియు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని ఐఎండీ సూచించింది. ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకించి ఎక్స్‌ప్రెస్‌వేలలో.. విజిబిలిటీ మెరుగుపడే వరకు ప్రయాణాలను నిలిపివేయాలని కోరింది.
Also Read: Rolls Royce Spectre: చెన్నై రోడ్లపై దేశంలోని మొట్టమొదటి రోల్స్ రాయిస్ స్పెక్టర్ కార్..వీడియో..
Also Read: Ayodhya Ram mandir: అయోధ్యలో ఆకాశాన్నంటిన హోటళ్ల ధరలు.. ఏకంగా 500 శాతం పెరిగిన రేట్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter