Maharashtra Corona Cases: దేశంలో కరోనా మూడో వేవ్ లో మహమ్మారి ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. కరోనా హాట్‌స్పాట్ రాష్ట్రం అయిన మహారాష్ట్రలో ఆందోళనకర స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 46,723 మందికి పాజిటివ్ కేసులు తేలాయి.
మరోవైపు కరోనా ధాటికి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా 28,041 మంది కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,40,122కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1367కు చేరింది.
దేశంలోని కరోనా కేసులు
దేశవ్యాప్తంగా బుధవారం 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 442 మంది మరణించారు. మరోవైపు 60,405 మంది వైరస్‌ను జయించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒమిక్రాన్ కేసులుదేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read: Corona in India: ముంబయిలో తగ్గిన కరోనా కేసులు- ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రత
Also Read: ISRO New Chairman Somanath: ఇస్రో నూతన ఛైర్మన్‌గా సోమనాథ్ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook