/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

President Election 2022: రాష్ట్రపతి ఎన్నిక అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేత్రుత్వంలో రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ బలంతో విపక్షాలు సరితూగుతాయా లేదా అన్నది పక్కనపెడితే రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలుపుతారనే దానిపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

రాష్ట్రపతి ఎన్నిక కోసం మమతా బెనర్జీ నేత్రుత్వంలో ర్యాలీ అవుతున్న విపక్ష పార్టీలు శరద్ పవార్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించాయి. అయితే ఎన్‌సీపీ చీఫ్ పవార్ మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో మరో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మమతా ప్రతిపాదనపై ఇతర పార్టీల నేతలు ఎలా స్పందించారన్నది తెలియరాలేదు.

మరోవైపు, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం (జూన్ 15) పలువురు విపక్ష నేతలను ఫోన్ ద్వారా సంప్రదించి మద్దతు కోరారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులతో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు కోరారు. అయితే అభ్యర్థి ఎవరని విపక్ష నేతలు అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ సమాధానం చెప్పలేదు. దీంతో మద్దతు విషయంలో విపక్ష నేతలు కూడా ఏమీ బదులివ్వలేదని తెలుస్తోంది.

కాగా, రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం (జూన్ 15) నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జులై 2తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే జూలై 18న పోలింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర... 

Also Read: Horoscope Today June 16th : నేటి రాశి ఫలాలు.. ఈ 6 రాశుల వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
President election 2022 after sharad pawar refused mamata banerjee proposes two more names for president candidate
News Source: 
Home Title: 

President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు.. పవార్ విముఖతతో తెరపైకి మరో ఇద్దరి పేర్లు..
 

President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు.. పవార్ విముఖతతో తెరపైకి మరో ఇద్దరి పేర్లు..
Caption: 
President election 2022 opposition candidate (Image source: Zee News)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు

పోటీ చేసేందుకు నిరాకరించిన శరద్ పవార్

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెరపైకి మరో ఇద్దరి పేర్లు 

Mobile Title: 
President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, June 16, 2022 - 08:50
Request Count: 
70
Is Breaking News: 
No