Three dead and five injured bus overturned in UP: లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి 45 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు (Kanpur to Delhi) ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు శనివారం తెల్లవారుజామున.. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని తప్పల్ ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పి (bus overturned ) బోల్తాపడింది. దీంతో ఈ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. సహాయక చర్యలను చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు. Also read: Ram Gopal Varma: ‘దిశా ఎన్కౌంటర్’ సినిమాను ఆపండి
Three dead and five injured after the bus they were travelling in overturned in Tappal area of Aligarh district.
The bus carrying 45 passengers was on its way to Delhi from Kanpur. pic.twitter.com/EoJfYWrSrq
— ANI UP (@ANINewsUP) October 10, 2020
ఇదిలఉంటే.. అలీగఢ్ జిల్లాలోని తప్పల్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మరణించడంపై వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. Also read: Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe