Empty Stomach Issues: ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతుంటారు. అలా ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు నొప్పి, వాంతులు, బ్లడ్ షుగర్ వంటి సమ్యసలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి పరస్థితుల్లో ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తినాలని వైద్యలు సూచిస్తుంటారు. అయితే ఖాళీ కడుపుతో ఉన్నట్లు కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
మద్యం తాగరాదు!
ఉదయన్నే ఖాళీ కడుపుతో మద్యం తాగితే మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అలా మద్యం సేవించడం వల్ల సరాసరి అది మీ రక్తంలోకి కలిసిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అది మీ శరీరమంతటా వ్యాపిస్తుంది. దీని వల్ల పల్స్ రేటు పడిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయంలో సమస్యలు రావచ్చు. కాబట్టి ఖాళీ కడుపుతో మద్యం సేవించకుండా ఉండాలని వైద్యులు సూచిస్తారు.
నో కాఫీ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది కాఫీ తాగడాన్ని మనం గమనించే ఉంటాం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ వంటి పానీయాలను తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.
చూయింగ్ గమ్ నమలవద్దు..
చాలా మంది ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ కూడా నములుతూ ఉంటారు. అలాంటి అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవడం మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల మన పొట్టలో జీర్ణ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ డైజెస్టివ్ యాసిడ్స్ ఖాళీ కడుపులో ఎసిడిటీ నుంచి అల్సర్ల వరకు అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలకపోవడమే మంచిది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read; Dehydration Symptoms: రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్త పడండి!
Also Read: iPhone Factory Reset: ఐఫోన్ ను రీసెట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ సులభమైన టిప్స్ తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook