Gomata Nagadevatha Friendship Viral Video: నిజానికి జంతువులు ఏ పాములు చూసిన భయపడుతూ ఉంటాయి. అది ఎక్కడ కాటేస్తుందోనని భయంతో అక్కడి నుంచి కొంత దూరం పరుగులు కూడా పెడతాయి. అంతేకాకుండా కొన్ని పాములు కూడా అతి క్రూరమైన జంతువుల దగ్గరికి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపవు. మరికొన్ని పాములైతే ఏదైనా అలికిడి చేస్తే చాలు ఆమడ దూరం పారిపోతూ ఉంటాయి. కానీ ఇటీవల ఓ పాము ఆవుతో స్నేహం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇది నిజమైన వీడియో నేనా లేదా ఎవరైనా ఎడిట్ చేశారా? ఈ ఘటన ఎక్కడ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే..
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda (@susantananda3) August 3, 2023
జంతువులను చూస్తే పారిపోయే పాము ఆవు దగ్గరికి వచ్చి ఆ బ్లాక్ కింగ్ కోబ్రా పడగలను నాలుకతో తాకినప్పటికీ అది కాటయ్యకపోవడం రెండిటి మధ్య స్నేహాన్ని తెలుపుతోంది. ఆ పాము ఒక్క కాటేస్తే చాలు ఆవు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయినప్పటికీ ఆ ఆవు పాము పై ఉన్న బలమైన నమ్మకాన్ని చూపుతూ పాము పడగలను తన నాలుకతో తోడువడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తోంది. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ నాగదేవుడికి గోమాత కి మధ్య ఉన్న స్నేహమేనని చెప్పుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఇదంతా పరమేశ్వరుడు లీలనేనని వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఓ పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ లోది.. అయితే దీనిని IFS అధికారి సుశాంత్ నంద ట్రీట్ చేశాడు. ఇంతకుముందు ఈ వీడియో కింగ్ కోబ్రా టీవీ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాను షేర్ చేసింది. అయితే ఇలాంటి ఘటనకు సంబంధించినవే ఆ యూట్యూబ్ ఛానల్ అనేక వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోను 9వేల మందికిపైగా లైక్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి