Festival in June 2023: ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, ఆరో నెల జూన్. ఇది జ్యేష్ఠ మాసంతో ప్రారంభమై ఆషాఢ మాసంతో ముగుస్తుంది. ఈ నెలలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. అంతేకాకుండా జూన్ లో కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు రాబోతున్నాయి. ఇందులో వట్ పూర్ణిమ వ్రతం, యోగిని ఏకాదశి, జగన్నాథ యాత్ర, వినాయక చతుర్థి, దేవశయని ఏకాదశి మెుదలైనవి ఉన్నాయి. ఈ నెలలో వచ్చే పండుగలేంటో తెలుసుకుందాం.
జూన్ నెల పండుగలు/ వ్రతాల లిస్ట్:
జూన్ 1, 2023 (గురువారం) - నిర్జల ఏకాదశి వ్రతం, ప్రదోష వ్రతం
జూన్ 3, 2023 (శనివారం) - వట్ పూర్ణిమ వ్రతం, జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం
4 జూన్ 2023 (ఆదివారం) - కబీర్ జయంతి
జూన్ 5, 2023 (సోమవారం) - ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది
7 జూన్ 2023 (బుధవారం) - కృష్ణ పింగళ్ సంకష్టి చతుర్థి
జూన్ 9, 2023 (శుక్రవారం) - పంచక్ ప్రారంభమవుతుంది
10 జూన్ 2023 (శనివారం) - కాలాష్టమి
13 జూన్ 2023 (మంగళవారం) పంచక్ ముగుస్తుంది
14 జూన్ 2023 (బుధవారం) - యోగిని ఏకాదశి ఉపవాసం
జూన్ 15, 2023 (గురువారం) - మిథున సంక్రాంతి, ప్రదోష వ్రతం
16 జూన్ 2023 (శుక్రవారం) - నెలవారీ శివరాత్రి
17 జూన్ 2023 (శనివారం) - రోహిణి వ్రతం, దర్శ అమావాస్య
జూన్ 18, 2023 (ఆదివారం) - ఆషాడ అమావాస్య
జూన్ 19, 2023 (సోమవారం) - ఆషాఢ నవరాత్రులు (గుప్త నవరాత్రులు) ప్రారంభం
20 జూన్ 2023 (మంగళవారం) - జగన్నాథ రథయాత్ర
22 జూన్ 2023 (గురువారం) - వినాయక చతుర్థి
25 జూన్ 2023 (ఆదివారం) - భాను సప్తమి ఉపవాసం
28 జూన్ 2023 (బుధవారం) - ఈద్ అల్-అధా (బక్రీద్)
29 జూన్ 2023 (గురువారం) - గౌరీ వ్రతం ప్రారంభం, దేవశయని ఏకాదశి
30 జూన్ 2023 (శుక్రవారం) - దేవశయని ఏకాదశి పరాన్, వాసుదేవ్ ద్వాదశి.
Also Read: Surya Gochar 2023: రోహిణి నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 5 రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..
జగన్నాథ యాత్ర - దేశంలోని నాలుగు పవిత్ర ప్రదేశాలలో పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలసి రథం ఎక్కుతారు. ఈ రథయాత్రలో పాల్గొన్న వారికి వంద యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇది ఒడిశా రాష్ట్రంలో కన్నుల పండువగా జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook