Shani Puja tips: న్యాయాధిపతి మరియు కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే శని భగవానుడి ఆశీర్వాదంతో మనిషి జీవితం సంతోషం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. మరోవైపు శని అనుగ్రహం లేకపోతే ఆ వ్యక్తి జీవితం నాశనమవుతుంది. కాబట్టి ప్రజలు శని దేవుడిని (Lord Shani) చూసి చాలా భయపడతారు. శని సడేసతి, ధైయా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఒక వేళ శని ప్రసన్నుడైతే, ఆ వ్యక్తికి సర్వతోముఖ ప్రయోజనాలు లభిస్తాయి.
శని యొక్క శుభ సంకేతాలు
జీవితంలో శని యెుక్క చెడు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లే, శని దేవుడి అనుగ్రహం పొందే సంకేతాలు (Shani Good Signs) కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
>> శనివారం నాడు బూట్లు మరియు చెప్పులు దొంగిలించబడినట్లయితే, అది చాలా శుభ సంకేతం. శని దేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నారని అర్థం. దీని వల్ల మీ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి.
>> మీరు తక్కువ సమయంలోనే ధనవంతుడిగా మారినా లేదా అపారమైన డబ్బు సంపాదించినా దానికి శని అనుగ్రహం ఉందని గుర్తించుకోండి. మీ దగ్గర పెద్ద మెుత్తంలో ఐశ్వర్యం ఉన్నట్లయితే..పేదలకు దానం చేయండి.
>> మీ కీర్తి ప్రతిష్టలు వేగంగా పెరుగుతుంటే, అది మీ పట్ల శనీశ్వరుడి దయ యొక్క ఫలితం అని భావించండి. శనీశ్వరుడు ప్రసన్నుడైతే, వ్యక్తి యొక్క కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, శని దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి మరియు అతనిని పూజించండి.
>> శని అనుగ్రహం మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటే, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇది కూడా శని దేవుడి ఆశీర్వాదానికి సంకేతం. ఇది జరిగినప్పుడు రోగులకు సహాయం చేయడానికి విరాళం ఇవ్వండి. అలాగే శనివారం నాడు శని ఆలయానికి వెళ్లి పూజించండి.
Also Read: Guru Purnima 2022: గురు పూర్ణిమ రోజు 4 రాజయోగాలు.. శుభ ముహూర్తంలో పూజలు చేయడం వల్ల మీకే మేలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.