Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్

BCCI Angry On Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ మొత్తం ఆటగాళ్లందరికీ బీసీసీఐ వార్నింగ్ ఇచ్చేలా చేసింది. యోయో టెస్ట్‌కు సంబంధించిన స్కోరును కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఆగ్రహానికి గురైంది. ఆసియా కప్‌కు టీమిండియా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.    

Written by - Ashok Krindinti | Last Updated : Aug 25, 2023, 12:15 PM IST
Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ఆటగాళ్లందరికీ వార్నింగ్

BCCI Angry On Virat Kohli: ఆసియా కప్ 2023కు టీమిండియా రెడీ అవుతోంది. సన్నాహక శిబిరంలో భాగంగా బెంగళూరులో భారత జట్టు బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు అందరికీ యోయో టెస్ట్‌ను బీసీసీఐ నిర్వహించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన యోయో స్కోర్‌ను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. బీసీసీఐకి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా గోప్యమైన పోస్ట్‌లను చేయవద్దని కోహ్లీని మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. 

విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. ఈ నేపథ్యంలో యోయో టెస్టుకు సంబంధించిన వివరాలను కూడా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇదే బీసీసీఐ ఆగ్రహానికి కారణమైంది. యోయో టెస్టులో తన స్కోర్ 17.2 అని కోహ్లీ పోస్ట్ చేశాడు. కోహ్లీ చేసిన ఈ చర్య బీసీసీఐకి అస్సలు నచ్చలేదు.

నిబంధనల ప్రకారం.. ఏ క్రికెటర్ కూడా తన యో-యో టెస్ట్ స్కోర్‌ను బయటకు వెళ్లడించకూడదు. కోహ్లీ పోస్ట్ తరువాత ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. మిగిలిన ఆటగాళ్లను కూడా హెచ్చరించినట్లు తెలిసింది. యోయో టెస్టు వివరాలను ఎక్కడా వెళ్లడించవద్దని ఆటగాళ్ల అందరికీ సూచించినట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో స్టార్‌ ఆటగాళ్లు కూడా మొదటి రోజు కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొన్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో ఆడని ఆటగాళ్లకు 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. 

ఈ నెల 30వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ముల్తాన్‌లో పాకిస్థాన్-నేపాల్‌ జట్ల మధ్య పోరుతో టోర్నీ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 2న పల్లెకెలెలో పాకిస్థాన్‌తో భారత్ తమ పోరు ఆరంభించనుంది. ప్రపంచకప్‌కు సన్నాహంగా ఈ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ఇటీవల ఐర్లాండ్‌ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లు ట్రైనింగ్ క్యాంప్‌లో చేరనున్నారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల తరువాత రీఎంట్రీ ఇవ్వగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలిసారి వన్డే టీమ్‌కు ఎంపికయ్యాడు.

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో భారీ అల్ప పీడనం, ఏపీ- తెలంగాణల్లో భారీ వర్షాలు

Also Read: An Other Agrigold Scam: అధిక వడ్డీ ఆశ చూపించి.. రూ. 1500 కోట్లకు కుచ్చుటోపి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News