KL Rahul to lead Team India in Zimbabwe ODI series: భారత్ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించిన విషయం తెలిసిందే. టీ20, వన్డే సిరీస్‌ను గెలిచి మంచి ఊపులో ఉన్న టీమిండియా.. నేరుగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. విండీస్ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యారు. దీంతో వెటరన్ ఓపెరన్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20 సిరీస్‌కు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారందరూ తిరిగి జట్టులో చేరనున్నారు. టీ20 ప్రపంచకప్ 2022కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్లేయర్స్ అందరూ పొట్టి సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు.
విండీస్‌తో సిరీస్ అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. హరారే వేదికగా ఆగస్టు 18న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే ఆగస్టు 27 నుంచి ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో.. జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.
జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఇటీవల జట్టుకు దూరంగా ఉన్న రాహుల్ విండీస్ టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్ టీ20 సిరీస్‌కు ముందు రాహుల్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే.. ఫ్లైట్ ఎక్కి తుది జట్టులో ఆడనున్నాడు. ఒకవేళ విఫలమైనా జింబాబ్వే ఆరంభ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధిస్తాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో అయినా గాడిలో పడాలని బీసీసీఐ భావిస్తోంది. కీలక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ 2022 ఉన్న నేపథ్యంలో కోహ్లీఫామ్ అందుకోవడం జట్టుకు చాలా కీలకంగా మారింది. కోహ్లీ సెంచరీ చేసి ఇప్పటికే మూడేళ్లు అయిన విషయం తెలిసిందే. సెంచరీ కోసం ఆయన ఫాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
Also Read: వ్యాయామం చేస్తూనే.. పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ! వరుణ్ ధావన్ ఏమన్నాడంటే
Also Read: Liger Trailer Review: విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ ఎలా ఉందంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook