Mithali Raj fiftys helps India set 278 target to Australia: ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచులో భారత్ బరి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసి.. ఆసీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్(68; 96 బంతుల్లో 4x4, 1x6), యువ ప్లేయర్ యాస్తిక భాటియా (59; 83 బంతుల్లో 6x4), వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (57; 47 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాదారు. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (10), షఫాలీ వర్మ (12) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, అలనా కింగ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ భారత జట్టుకు చాలా కీలకం. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆస్ట్రేలియా బౌలర్లు ఇన్నింగ్స్ ఆదిలోనే భారీ షాకిచ్చారు. ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ (12)లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. దాంతో భారత్ 28 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యస్తిక భాటియా, మిథాలీ రాజ్ ఆచితూచి ఆడారు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు.
Innings Break!
Solid show by #TeamIndia to post 2⃣7⃣7⃣/7⃣ on the board! 👏 👏 #CWC22 | #INDvAUS
6⃣8⃣ for captain @M_Raj03
5⃣9⃣ for @YastikaBhatia
5⃣7⃣* for vice-captain @ImHarmanpreet
3⃣4⃣ for @Vastrakarp25Over to our bowlers now. 👍
Scorecard ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/EAqhkwqL4O
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
హాఫ్ సెంచరీలు చేసిన కొద్ది సమయానికే యస్తిక భాటియా, మిథాలీ రాజ్ ఔటయ్యారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రీచా ఘోష్ (8), స్నేహ్ రాణా (0) విఫలమవడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో హర్మన్, పూజా (34; 28 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడారు. బౌండరీలు బాదుతూ వీరిద్దరూ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే హర్మన్ 48వ ఓవర్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఇక ఇన్నింగ్స్ చివరి బంతికి పూజా రనౌటైంది. దీంతో భారత్ 278 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది.
Also Read: Jhulan Goswami: డబుల్ సెంచరీ కొట్టిన ఝులన్ గోస్వామి.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!!
Also Read: Today Horoscope March 19 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook