Moto G34 5G Launch Date: అదిరిపోయే ఫీచర్లతో Moto G34 5G స్మార్ట్ ఫోన్.. కెమెరా, ధర వివరాలు ఇలా..!

Moto G34 5G Price and Features: అదిరిపోయే ఫీచర్లతో  Moto G34 5G ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. జనవరి 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు భారత్‌లో మొదలుకానున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ధర, ఫీచర్ వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 12:02 AM IST
Moto G34 5G Launch Date: అదిరిపోయే ఫీచర్లతో Moto G34 5G స్మార్ట్ ఫోన్.. కెమెరా, ధర వివరాలు ఇలా..!

Moto G34 5G Price and Features: మోటరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుంది. Moto G34 5Gని ఈ నెల 9న మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో అత్యంత వేగవంతమైన 5G ఫోన్‌గా రానుంది. సూపర్-ఫాస్ట్ 5G కనెక్టివిటీని తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది. G34 2 వేరియంట్‌లలో ఈ ఫోన్ లభించనుంది. 8 GB + 128 GB, 4GB +128 GB, వేగన్ లెదర్ డిజైన్‌తో Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ధర, ఫీచర్లు వంటి వివరాలను ఇలా..

Moto G34 5G జనవరి 9వ తేదీ నుంచి మన దేశం అంతటా ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది. మోటరోలా ఫోన్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా.. రూ.12 వేలు, రూ.15 వేల పరిధిలో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 5G బడ్జెట్ విభాగంలో ఇతర మొబైల్స్‌కు పోటీదారుగా ఉంటుందని అంటున్నారు. 

ఫీచర్స్ ఇలా..

ప్రాసెసర్: Qualcomm Snapdragon 695 G34 5Gకి పవర్‌ ఉంటుంది. ఇంతకుముందున్న Moto G32 కంటే మరింత మెరగైన పనితీరును మెరుగుపరుస్తుంది.
మెమరీ: 4 GB RAM నుంచి 8GB RAM వరకు స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉంది. 
స్టోరేజ్: 64GB వరకు 128GB వరకు ర్యామ్ కాంబినేషన్‌తో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా మరింత విస్తరించవచ్చు.
డిస్‌ప్లే: 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ ఫోన్‌లో ఫీచర్ ఉంటుంది. వినియోగదారులకు సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది.
కెమెరా: సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాల కోసం 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉన్న డ్యూయల్ లెన్స్ సెటప్ అందుబాటులో ఉంది.
పవర్ బ్యాకప్: Moto G34 5Gలో 5000mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. టర్బో-చార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది.
సాఫ్ట్‌వేర్: Android 14 ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. Android అప్‌గ్రేడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని భావిస్తున్నారు.

Motorola G32తో పోలిస్తే.. Moto G34 5G ఉండే ఫీచర్లు ఇవే..!

==> 5G కనెక్టివిటీ: 13 5G బ్యాండ్‌ల సపోర్ట్‌త హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
==> స్పీడ్ ప్రాసెసర్: మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం సూపర్‌గా పనిచేస్తుంది.
==> 120Hz రిఫ్రెష్ రేట్:  G32 60Hz డిస్‌ప్లేతో పోలిస్తే మెరుగైన క్వాలిటీ ఉంటుంది.
==> మెయిన్ కెమెరా సెన్సార్: బ్యాక్ కెమెరా నుంచి పిక్స్ అదిరిపోయేలా వస్తాయి.
==> తాజా ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు: మోటరోలా నుంచి ఊహించిన Android 15, ఫీచర్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో సరికొత్త Android 14 ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.

ట్విస్ట్-టు-ఓపెన్ కెమెరా, మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది. Moto G34 5G దాని మంచి స్పెసిఫికేషన్‌లు, 5G ​​ఎనేబుల్డ్ టెక్నాలజీ, తక్కువ బడ్జెట్‌లో 5G సెగ్మెంట్‌లో మంచి పోటీదారుగా కనిపిస్తోంది. జనవరి 9న లాంచ్‌ కానున్న Moto G34 ఫోన్‌ను కొనేందుకు సిద్ధంగా ఉండండి.

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News