CM Revanth Reddy: ఢిల్లీ పోలీసుల నోటీసులు.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి   హోమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు. బీజేపీ పైపోరాటం చేస్తున్నందుకే, ఢిల్లీ పోలీసులను పంపి మరీ నోటీసులు ఇప్పించారన్నారు. ఈ ఘటన తెలంగాణ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2024, 08:14 PM IST
  • గాంధీభవన్ చేరుకున్న ఢిల్లీ పోలీసులు..
  • మండి పడిన సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy: ఢిల్లీ పోలీసుల నోటీసులు.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Fires On PMMOdi and Homemister amit shah: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా సమ్మర్ హీట్ ను మరింతగా పెంచేశాయి. ఢిల్లీ పోలీసులు మధ్యాహ్నాం ఒక్కసారిగా కాంగ్రెస్ భవన్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే సతీష్ కు పోలీసులు నోటీసులు  జారీ చేశారు. 91 సీఆర్పీపీసీ కింద ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కేంద్రహోమంత్రి అమిత్‌ షా ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామన్నారు అయితే, షా ప్రసంగాన్ని కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారంటూ కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ పోలీసులు కేసునమోదుచేశారు. దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా స్పందించిందని తెలుస్తోంది. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులు పంపగా మరికొంత మంది కాంగ్రెస్ నాయకులకు కూడా ఢిల్లీ  నోటీసులు నోటీసులు జారిచేసినట్లు తెలుస్తోంది.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ భవన్ కు వచ్చి నోటీసులు ఇవ్వడం పై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.  ‘బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇవ్వడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని అన్ని విధాలుగా గట్టిగా ఎదురు దాడి చేస్తున్నానని, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించినందుకు తనపై , గాంధీభవన్ నేతలపై ఢిల్లీ పోలీసులను పంపి నోటీసులు ఇప్పించారన్నారు. ఒకప్పుడు.. బీజేపీ ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను పంపేదని ఇప్పుడు బీజేపీ ట్రెండ్ మార్చిందని సెటైర్ వేశారు. ఈసారి ఢిల్లీ పోలీసులను ముందుగా మోదీ టీమ్ రంగంలోకి దింపిందని అన్నారు.

ఢిల్లీ పోలీసులుద్వారా అమిత్ షా.. నోటీసులు ఇప్పించారని విమర్శించారు. అంతేకాకుండా.. ఇక్కడ ఎవరు కూడ భయపడేవారులేరన్నారు. దీనిపై గట్టిగా కౌంటర్ ఇస్తామన్నారు.వచ్చే ఎన్నికలలో బీజేపీని ఓడిద్దామంటూ పిలుపునిచ్చారు. కర్ణాటకలో, తెలంగాణలో బీజేపీని ప్రజలు ఓడించి బుద్ది చెప్పాలని కూడా సీఎం రేవంత్ ప్రచారంలో స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. అయితే.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనంటూ కామెంట్లు చేస్తుంది. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీటీమ్ అంటూ కూడా విమర్శిస్తుంది. ఇక ఇటీవల బండి సంజయ్ మరో అడుగు ముందుకేసీ.. సీఎం రేవంత్ త్వరలో బీజేపీలోకి చేరిపోతారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దుకాణం బంద్‌ కావడానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News