హైద్రాబాద్‌లో ఐసిస్ కలకలం, డిజిటల్ పరికరాలు స్వాధీనం ?

                                

Last Updated : Aug 6, 2018, 10:33 PM IST
హైద్రాబాద్‌లో ఐసిస్ కలకలం, డిజిటల్ పరికరాలు స్వాధీనం ?

హైదరాబాద్: పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు సంబంధించిన అనుకూల కార్యకలాపాలను పలువురు నెరపుతున్నారని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందుకున్న ఎన్ఐఏ బృందాలు పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో షాహీన్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుండగా.. పలు డిజిటల్ పరికరాలు లభ్యమైనట్లు మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పాతబస్తీకి చెందిన అబ్దుల్ ఖదీర్ అనే యువకుడు సామాజిక మాధ్యమాలు వేదికగా ఐసిస్ భావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఇంటెలిజెన్స్‌కు అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులను విశ్లేషించి.. 2016లో ఢిల్లీలో పట్టుబడిన నిందితులతో అబ్దుల్ ఖదీర్‌కు సంబంధాలు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ ఖదీర్ ఇంట్లో ఎన్ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. విచారణలో భాగంగా అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించి.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Trending News