Telangana Assembly : రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల అభివృద్ధి, త్వరలో పల్లె దవాఖానాలు : సీఎం కేసీఆర్

Telangana Assembly sessions: పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా పలు విషయాలను వివరించారు కేసీఆర్‌. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 06:01 PM IST
  • రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు
  • రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు
  • భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు
  • పట్టణాల్లో చెరువుల అభివృద్ధి
  • తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని పార్లమెంట్‌లో కేంద్రమే చెప్పింది
  • కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
  • అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్
Telangana Assembly : రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల అభివృద్ధి, త్వరలో పల్లె దవాఖానాలు : సీఎం కేసీఆర్

Telangana Assembly sessions on the sixth day CM KCR HIGHLIGHTS here: హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ (Hyderabad) శివారు ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో (Assembly) జరిగిన చర్చలో భాగంగా పలు విషయాలను వివరించారు కేసీఆర్‌ (KCR). అలాగే పలు ఇతర విషయాలపైన కూడా కేసీఆర్‌‌ స్పష్టతనిచ్చారు.

పేదవారికి రూ.1 నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని.. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మున్సిపల్‌ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పౌరుల భాగస్వామ్యం ఉండేలా చట్టాలు తీసుకు వచ్చామని తెలిపారు. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్‌బడ్జెట్‌ (green budget) కేటాయించినట్లు వెల్లడించారు. పట్టణాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నాం కేసీఆర్‌‌ (KCR) తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు భారీగా పెంచామని చెప్పుకొచ్చారు సీఎం. మంత్రి స్థాయి హోదా ఉన్న జెడ్పీ చైర్మన్‌కు (zp chairman) గౌరవ వేతనం రూ.6వేలు ఇచ్చేవారని.. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించిందని చెప్పుకొచ్చారు. నిధుల కోసం గ్రామ పంచాయతీల ఆస్తులను తాకట్టు పెట్టమని కేంద్రం తమకు సూచిస్తోందని కేసీఆర్‌‌ చెప్పారు. 

తెలంగాణ ఫ్లోరైడ్‌ (fluoride) రహిత రాష్ట్రమని పార్లమెంట్‌లో కేంద్రమే చెప్పిందని స్పష్టం చేశారు. గతంలో 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని.. తమ హయాంలో ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేలా నియామకాలు చేపట్టామని చెప్పారు కేసీఆర్. త్వరలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయనున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజలకు పల్లెల్లోనే వైద్యం అందేలా ఏర్పాటు చేస్తామని. గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు (diagnostic centres) పెంచుతామని చెప్పారు.

Also Read : MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు

కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (telangana) ఒకటి అని అన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని చెప్పారు. గత ప్రభుత్వాలు చెట్లు పెట్ట‌లేదు. అభివృద్ధి చేయ‌లేదని తాము రెండింటిని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. మంచినీళ్ల కోసం మిష‌న్ భ‌గీర‌థ‌ను చూసి నీతిఆయోగ్ ప్ర‌శంసించిందని.. రూ. 24 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్రానికి నీతి ఆయోగ్ (niti aayog) సూచిస్తే 24 పైస‌లు కూడా ఇవ్వ‌లేదన్నారు సీఎం. అవార్డులు మాత్రం మోయ‌లేన‌న్ని వచ్చాయన్నారు.

Also Read : Fuel prices in AP and TS: రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

రాష్ట్రంలో స‌ర్పంచ్‌ల కంటే స‌ఫాయి కార్మికుల‌కే ఎక్కువ జీతం ఇస్తున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీలో (ghmc) కార్మికుల‌కు రూ. 8500 ఇస్తే.. ఈరోజు కార్మికుల జీతాలు రూ. 17 వేలు ఇస్తున్నామన్నారు. స‌ర్పంచ్‌ల కంటే ఎంపీటీసీల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నామని చెప్పారు. కార్మికుల‌ను మ‌నం గౌర‌వించాలి.. గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌ను శుభ్రంగా ఉంచుతున్న కార్మికుల‌కు దండం పెట్టాలన్నారు. ఇక స‌ర్పంచ్‌ల గౌర‌వ వేత‌నాలు ఒక‌ప్పుడు చాలా త‌క్కువ‌గా ఉన్నాయని జిల్లా ప్ర‌జాప‌రిష‌త్ చైర్మ‌న్ల‌కు గ‌తంలో రూ. 7500 ఉండేదని అన్నారు.. ఇప్పుడు ల‌క్ష రూపాయాలు ఇస్తున్నామని చెప్పారు.

Also Read : Sex Rocket in Hyderabad: సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్.. బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం!

దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ (telangana) అభివృద్ధి జ‌రుగుతోంది అని అన్నారు. వ‌క్ఫ్ బోర్డు (Waqf Board) భూముల విచార‌ణ‌కు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక కేంద్రం మాత్రమే నిధులు ఇస్తుందనే భావన సరికాదని.. స్థానిక స్వపరిపాలన సవ్యంగా సాగాలని ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు (finance commission funds) కేటాయిస్తుందని చెప్పారు. కేంద్రం పోస్టుమ్యాన్‌లా మాత్రమే వ్యవహరిస్తుందని.. దేశాన్ని నడిపే క్రమంలో సిస్టమ్స్‌ ఉంటాయని కేసీఆర్ (KCR) చెప్పారు.

 

Also Read : Samantha post on SocialMedia: విడాకుల తర్వాత సమంత తొలిసారిగా సోషల్‌మీడియాలో పోస్ట్‌.. పెళ్లి రోజు అలాంటి పోస్ట్ చేసిన సామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News