Inter Exam Postponed: అసనీ తుపాను ప్రభావం, ఇంటర్ మొదటి సంవత్సరం మేథ్స్ పరీక్ష వాయిదా

Inter Exam Postponed: అసనీ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 10, 2022, 09:24 PM IST
Inter Exam Postponed: అసనీ తుపాను ప్రభావం, ఇంటర్ మొదటి సంవత్సరం మేథ్స్ పరీక్ష వాయిదా

Inter Exam Postponed: అసనీ తుపాను ప్రభావం ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అసనీ తుపాను దూసుకొస్తోంది. అసనీ తుపాను కారణంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రెడ్ అలర్ట్ జారీ అయింది. ముఖ్యంగా పది జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ పది జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అమలాపురం, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం జిల్లాల్లో 20-25 సెంటీమీర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం మన్యం, పాడేరు, విజయవాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని సమాచారం. 

మొదటి సంవత్సరం మేథ్స్ పరీక్ష వాయిదా

అసని తుపాను కారణంగా రేపు అంటే మే 11వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మేథ్స్ పరీక్ష ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. పరీక్ష కేంద్రం, సమయంలో ఏ విధమైన మార్పులుండవని..అదే విధంగా మే 12 నుంచి మిగిలిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయని వెల్లడించింది. తుపాను కారణంగా విద్యార్ధులు, సిబ్బందికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వాయిదా పడిన పరీక్షను అదే సమయంలో మే 25వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మే 18వ తేదీతో పూర్తి కానున్నాయి. ఇప్పుడు రేపటి పరీక్ష కోసం మరో వారం రోజులు విద్యార్ధులు నిరీక్షించాల్సిన పరిస్థితి.

Ap intermediate first year exam postponed

Also read: Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News