Big Boost To Pawan Kalyan: గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పిఠాపురంలో పవన్ పోటీ నిలబడ్డాడు. అక్కడ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అయితే పవన్‌ను ఎలాగైనా చట్టసభలోకి పంపించాలని అతడి అభిమానులతో సినీ పరిశ్రమలోని కొందరు కంకణబద్దులయ్యారు. పవన్ గెలుపు కోసం సినీ పరిశ్రమ తరలివస్తోంది. ఇప్పటికే బుల్లి తెర నటీనటులు ప్రచారంలోకి దిగగా.. తాజాగా పవన్ పెద్దన్న చిరంజీవి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇక సినీ నటులు నాని, రాజ్ తరుణ్ పవన్‌కు మద్దతు ప్రకటించారు.
Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు
పిఠాపురంలో ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగా కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేశారు. బుల్లి తెర నటులు సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌తోపాటు ఇతరులు పిఠాపురంలోనే మకాం వేశారు. జానీ మాస్టర్, పృథ్వీ కూడా పవన్‌కు మద్దతు చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్‌ను హీరో నాని మద్దతు ప్రకటించడం విశేషం. యువ నటుడు రాజ్ తరుణ్ కూడా పవన్‌కు అండగా నిలిచాడు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో సినీ పరిశ్రమ నుంచి మరికొందరి నటీనటుల నుంచి కూడా పవన్‌కు మద్దతు లభించే అవకాశం ఉంది.
Also Read: Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి
నా మద్దతు మీకే
'మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. మీ సినిమా కుటుంబసభ్యుడిగా మీరు కోరుకున్న విజయం సాధించాలని ఆశిస్తున్నా. మీ హామీలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు కోట్లాది మంది ప్రేమాభిమానులు తోడు ఉన్నాయి. నా మద్దతు మీకే' అని నాని 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.
మీరు కావాలి
'ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషి, ప్రయత్నాలను తొలి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి' అని రాజ్ తరుణ్ 'ఎక్స్'లో ట్వీట్ చేశాడు.
పక్కా ప్రణాళిక?
ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న మద్దతు వెనుక ఒక వ్యూహం ఉందని తెలుస్తోంది. పోలింగ్ సమయానికి సినీనటులు మద్దతు ప్రకటించేలా జనసేన, టీడీపీలు ప్రణాళిక వేసుకున్నాయని సమాచారం. రానున్న రోజుల్లో అగ్రతారల నుంచి కూడా పవన్‌కు మద్దతు దక్కే అవకాశం లేకపోలేదు. అయితే పవన్ మద్దతుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. ఎంత మంది సినీతారలు తీసుకువచ్చినా పిఠాపురంలో తిరిగేది ఫ్యాన్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం నటులతో మాటలు చెప్పించినంత సులువు కాదు ఎన్నికల్లో గెలవడం అని వైసీపీ నాయకులు హితవు పలుకుతున్నారు. పిఠాపురంలో వంగా గీత గెలవడం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
— Hi Nani (@NameisNani) May 7, 2024
Since day 1, I’ve been watching your vision and efforts for the well being of Andhra Pradesh!!
As one among millions of hopes….I'm cheering for you to step in and change people's fortunes for the better sir….🤗🤗
Ippudu janam ki nuvvu kaavali :) @PawanKalyan @JanaSenaParty
— Raj Tarun (@itsRajTarun) May 7, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter