Vijayawada Floods: వరద ప్రాతాల్లో ఏరియల్ సర్వే చేశామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించానని.. కృష్ణా నదిని సముద్రంలో కలిసే ప్రాంతం వరకు చూశాని చెప్పారు. బుడమేరు గండ్లు వేగంగా పూడ్చాలని మరోసారి ఆదేశించామన్నారు. ముందు బుడమేరు గండ్లు పూడ్చాలని.. అదే తమ లక్ష్యమన్నారు. బుడమేరు రెండు గండ్లు పూడ్చేశామని.. మరో దాన్ని పూడ్చాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పైనుంచి ప్రవాహం ఏమీ రావడం లేదని.. వరద సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి పనులు చేపట్టినట్లు వివరించారు. వరద ప్రాంతాల్లో 72 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని.. వరద ముంపు ప్రాంతాల్లో నీరు తగ్గుతోందన్నారు.
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పాలు, బిస్కట్లు, కొవ్వొత్తులు అందజేశామన్నారు. వరద ప్రాంతాల్లో 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని.. నీరు నిల్వ ఉన్నచోట తప్ప మిగతా చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌ల అవసరం ఉందన్నారు. వరద ప్రాంతాల్లో డ్రోన్లతో మొదటిసారి ఆహారం అందించామని.. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాల కిట్ ఇస్తున్నామి చెప్పారు. ఈ కిట్ మరో మూడు రోజుల్లో అందరికీ అందుతుందన్నారు.
అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇళ్లు, రోడ్లు, కాలవలన్నీ శుభ్రం చేయిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వరద ప్రాంతాల్లో కూరగాయల ధరలు నియంత్రిస్తామని.. కూరగాయల ధరలు రూ.2, రూ.5, రూ.10 గా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఇళ్లల్లో సామగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. CSR కింద సాయం చేయాలని అందరినీ కోరుతున్నామని.. చాలామంది వరద బాధితులకు సాయం చేస్తున్నారని తెలిపారు...
ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత సాయం చేయగలమో ఆలోచిస్తున్నారు సీఎం చంద్రబాబు. బాధితులకు సాయంపై కేంద్రం, బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని.. బీమా కట్టిన అందరినీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. ఇలాంటి విపత్తు మరోసారి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
CM Chandrababu Naidu: కష్టాల్లో అండగా ప్రభుత్వం.. ఉచిత బస్సు ప్రయాణం, కూరగాయల ధరలు రూ.2 మాత్రమే