Weight loss Tips: మారుతున్న జీవనశైలిలో బరువు పెరగడం అనేది సాధారణ సమస్యగా మారింది. బరువును నియంత్రించడానికి మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కావున బరువు తగ్గడం పెద్ద సవాలుగా మారింది. అధిక మొత్తంలో బరువు పెరుగుతుంటే రాత్రి పడుకునే ముందు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు తగ్గాలనుకుంటే రాత్రి కొంత సమయమే నిద్రపోండి..!:
సాధారణంగా చాలా మంది 12 గంటల పాటు నిద్రపోతారు. అయితే తిన్న వెంటనే నిద్ర పోవడం వల్ల శరీరంలో మార్పులు ఏర్పడి బరువు పెరుగుతున్నారని పలు నివేదికల్లో పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో రాత్రి తక్కువ సమయం పాటు నిద్రపోతే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తాగండి:
నిద్రపోయే ముందు ప్రోటీన్ షేక్ తాగితే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈషేక్ శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. కావున బరువును సులభంగా తగ్గిస్తుంది.
స్లీప్ మాస్క్ ధరించి పడుకోవాలి:
స్లీప్ మాస్క్ ధరించడం వల్ల బరువు తగ్గడానికి సంబంధం ఏమి ఉందని అనుకుంటున్నారా.? మసక వెలుతురులో నిద్రించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కాంతిలో నిద్రిస్తున్న వారు స్లీప్ మాస్క్ ధరించి నిద్రించడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Garlic and Beetroot: ఆ రెండూ డైట్లో చేర్చుకుంటే హార్ట్ ఎటాక్, బీపీ తగ్గినట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.