Surya Grahanam: 15 రోజుల వ్యవధిలోనే సూర్య, చంద్ర గ్రహణాలు.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

Surya Grahanam: భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. అనంత చతుర్ధశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి చేరకుంటారు. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఎంతో పవిత్రమైన పితృ పక్షాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో పౌర్ణమి, అమావాస్యల్లో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 12, 2024, 12:39 PM IST
Surya Grahanam: 15 రోజుల వ్యవధిలోనే సూర్య, చంద్ర గ్రహణాలు.. ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

Surya Grahanam: ఈ ఇయర్ లో రెండో చంద్ర గ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడుతోంది.  రెండో సూర్య గ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. పక్షం వ్యవధిలో  రెండు గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు. అందువల్ల ఈ రెండు గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అయితే 18-9-2024న భాద్రపద పౌర్ణమి బుధవారం రోజున రాహుగ్రస్త ఖండగ్రాస చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం టర్కీ, బల్గేరియా, యూఎస్ఏ, లండన్, గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, ఈజిప్ట్ హంగేరి, నైజీరియా, బ్రెజిల్, ఇటలీ, జర్మనీ, రష్యా, పోర్చగల్, రొమేనియా, నెదర్లాండ్,మెక్సికో, అర్జంటైనా దేశాల్లో ఈ గ్రహణం కనపబడుతోంది. దీన్ని ఖండగ్రాస చంద్ర గ్రహణం అంటారు.

అక్టోబర్ 2న ఏర్పడే గ్రహణాన్ని కంకణాకార సూర్య గ్రహణం అంటారు. బాధ్రపద అమావాస్య రోజున ఏర్పడే సూర్య గ్రహణం .. కేతు గ్రస్త కంకణాకార సూర్య గ్రహణంగా పిలుస్తారు. ఈ సూర్య గ్రహణం చిలీ, అర్జెంటైనా, అమెరికన్ సమోవా, అంటార్కిటిక, బ్రెజిల్, కుకు దీవులు,ఫిజి, ఫ్రెంచి, పాలినేషియా, కిరిచాటి, మెక్సికో, న్యూజిలాండ్, నియూ, పరాగ్వే, పెరూ, ఫిట్ కెర్న్ దీవులు, దక్షిణ జార్జియా, శాండ్ విచ్, టంగా, తువాలు, యూఎస్ మైనర్ అవుట్ వెయింగ్ దీవులు, ఉరుగ్వే వాలిస్, పుటానా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.

చంద్ర, సూర్య గ్రహణాల నేపథ్యంలో భారత దేశ ప్రజలు యథావిధిగా తమ నిత్య కర్మలు, శ్రాద్ధ కర్మలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చు. పితృ పక్షాల్లో తమ పెద్దలను తలుచుకొని తిలా దానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.  పితృ పక్షం భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత 15 రోజులను పితృపక్షంగా సంబోధిస్తారు. ఈ సమయంలో మన పూర్వీకులు భూమికి వస్తారనేది మన పెద్దలు చెప్పిన మాట.  ఈ సమయంలో చేసే శ్రాద్ధ మరియు తర్పణం వారి నిర్ణీత తిథుల్లో చేయాలి.  ఇలా చేయడం వల్ల మన పితృ దేవతలు సంతృప్తి చెంది తమ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారనేది పురణాలు చెబుతున్నాయి.

ఏదైనా అనివార్య పరిస్థితుల్లో ఆయా తిథుల్లో పిండ ప్రధానం చేయలేని వారు.. అమావాస్య రోజున పిండ ప్రధానం చేయడం శ్రేయస్కరం. గ్రహణ ప్రభావం మన దేశంలో లేనందున పితృ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించవచ్చును. అమావాస్య రోజున ఏర్పడే  ఈ కంకణాకార సూర్యగ్రహణం దాదాపు 6 గంటల 4 నిమిషాల పాటు ఉండనుంది. చంద్ర గ్రహణం కుంభ, మీనరాశిల వారు అప్రమత్తంగా వ్యవహరించాలి. సూర్య గ్రహణం ఉత్తర నక్షత్రంలో ఏర్పడటం వల్ల సింహ, కన్య రాశుల వారు గ్రహణ సమయంలో సూర్య, నవగ్రహాల జపాలు చేసుకోవాలి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయలేము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని జ్యోతిష్యుల సలహా తీసుకోండి.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News